ద్వేషం

ద్వేషం మనిషికి ఆలోచన రహితంగా మారుస్తుంది!
ఆలోచన రహితులు, తమ విచక్షణను కోల్పొతారు!
మంచిని మరచి, కుచ్చితముగా నడిచి విపరీతానికి
లోనయ్యి, చేయవలసిన పనులు సైతం నిర్లక్ష్యానికి

గురయ్యి, మానసిక రుగ్మతకు ప్రేరేపితమై, కారణం
వీడి, తగవులు పడుట వ్యాపకమై, తమ వారిపై
విసుగును పడి, కకావిఖలంగా నడయాడి, వికృత
పోకడలకు లోబడి నిర్వీర్యంగా మారిపోతారు!సొంత

వారిలో చులకనగా మారి, గౌరవం కనుమరుగవుతుంది!
ద్వేషం సరికాదు! మనిషిగా మానవత్వముండాలి!
భాద కలిగినపుడు నేరుగా మాట్లాడి నివృత్తి చేసుకోవాలి!
ప్రతీది వడ్ల గింజలో బియ్యం గింజ లాగె వుంటాయి! నేరుగా

మాటాడితే దూదిపింజలా తేలిపోతుంది!ద్వేషం స్థానే,
ప్రేమ ప్రతిపలిస్తుంది! తన మేనుకు కూడా మేలవుతుంది!
నగుబాటు కాక అక్కున చేరి, తమ వారితో మనోల్లాసంగా
ఆనందడోలికలో విహరించవచ్చు! ప్రేమను ఆస్వాదించవచ్చు!

-జీవైఆర్