ఇక నుంచి తెరపై నేను ఎక్కువగా కనిపించాలని అనుకోవట్లేదుఅని నటి శ్రీరెడ్డి పేర్కొంది. ఎక్కువ శాతం మీడియాకే కేటాయించడం వల్ల కేసుల విషయంలో సమయం చిక్కట్లేదు. త్వరలో మా చెల్లెళ్లు తెరపైకి వస్తారు. ఎవరైతే ‘క్యాస్టింగ్ కౌచ్‌’లో బాధితులుగా ఉన్నారో వాళ్లంతా తెరమీదికి రాబోతున్నారు అని శ్రీరెడ్డి చెప్పుకొచ్చింది
 
 శ్రీరెడ్డి మాటలను బట్టి చూస్తే బాధితులు చాలా మందే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే తెరపైకి ఎంతమంది వస్తారో.. ఎన్ని లీకులు చేస్తారో? అనేదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కాగా బాధితులంతా తనతో టచ్‌లో ఉన్నారని.. అవసరమొచ్చినప్పుడు తెరపైకి తీసుకొస్తానని ఇదివరకే శ్రీరెడ్డి మీడియాముందు చెప్పిన సంగతి తెలిసిందే.