కొద్దిరోజుల క్రితం నటి శ్రీరెడ్డిపై నిషేధం విధిస్తూ.. ఆమెతో టాలీవుడ్‌లోని నటులెవ్వరూ నటించడానికి వీల్లేదని.. కాదని నటిస్తే చర్యలు తప్పవని ‘మా’ తేల్చిచెప్పిన సంగతి తెలిసిందే. అయితే సరిగ్గా వారం తిరగకముందే శ్రీరెడ్డి విషయంలో యూటర్న్ తీసుకుని ఆమెపై విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ‘మా’ ప్రకటించింది.
అంతేకాదు ఆమెకు త్రైమాసికంగా జరిగే సమావేశంలో సభ్యత్వంపై నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేసింది. ‘మా’ ప్రెస్‌మీట్‌లో సభ్యులు మాట్లాడుతున్న సమయంలో శ్రీరెడ్డి ఓ చానెల్‌ డిబెట్‌లో ఉంది. ప్రెస్‌మీట్ జరుగుతున్నంత సేపు.. టీవీవైపు చూస్తూ.. ఆమె పగలబడి నవ్వుకుంది.! ఆఖరికి తానే సక్సెస్ అయ్యాను అన్నట్లుగా.. మహా ఆనందంతో శ్రీరెడ్డి ఉబ్బితబ్బిబ్బైంది.!
 
ఈ సందర్భంగా మాట్లాడిన శ్రీరెడ్డి.. మా స్పందనపై నేను 20శాతం కూడా హ్యాపీగా లేను. నాకేం వాళ్లు వరాల జల్లు కురిపించలేదు. పండుగ చేసుకోమని వాళ్లేం నాకు భిక్ష వేయలేదు. అది నా హక్కు. వాళ్లు అవకాశాలు, మా సభ్యత్వం లాంటివి ఇవ్వకపోయినా ఏదో ఒక రూట్‌లో వెళ్లి నేను ఖచ్చితంగా తెచ్చుకునేదాన్ని. మేం అనుకున్న డిమాండ్స్‌కు మా నుంచి ఎలాంటి స్పందన రాలేదు. సో వెనక్కి తగ్గే సమస్యే లేదు.. పోరాటం ఉదృతం చేస్తాను అని శ్రీరెడ్డి చెప్పుకొచ్చింది.
శ్రీరెడ్డిపై నిషేధం ఎత్తివేయడమే కాకుండా సభ్యత్వం, క్యాష్ (కమిటీ అగెయినెస్ట్ సెక్సువల్‌ హెరాస్‌మెంట్‌)ను ఏర్పాటు చేస్తున్నట్లు మా ప్రకటించిన సంగతి తెలిసిందే.