పీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పొన్నం ప్రభాకర్‌

వేములవాడ: ప్రధానమంత్రి ఉపవాస దీక్షకు పూనుకోవడం దేశంలో అసమర్థపాలన కొనసాగుతుందనడానికి నిదర్శనమని పీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పొన్నం ప్రభాకర్‌ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం తిప్పాపూర్‌లోని హరిత హోటల్‌లో విలేకరులతో మాట్లాడారు. పార్లమెంటు సమావేశాల్లో ప్రతిపక్షాలు ఆవిశ్వాసం పెడితే నోట్ల రద్దు, జీఎస్టీ, కింగ్‌ఫిషర్‌ విజయమాల్య, బ్యాంక్‌ స్కాంలపె చర్చ జరుగుతుందనే భయంతో ప్రధాని మోదీ ఉపవాస దీక్షకు పూనుకున్నారని విమర్శించారు.

విశ్వాసం ఉంటే లోక్‌సభలో అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలన్నారు. ప్రధాని స్థాయిలో ఉండి దీక్ష చేయడమేంటని ప్రశ్నించారు. స్వచ్ఛ భారత్‌, యోగా కార్యక్రమాల్లో చీపురులు పట్టుకొని ఫొటోలకు ఫోజులిచ్చారని, ఉపవాస దీక్ష కూడా ఫొటోల కోసమే చేస్తున్నారని అన్నారు. దేశంలో జీఎస్టీ, పెద్ద నోట్ల రద్దుతో సామన్య ప్రజలను ఇబ్బందులకు గురి చేశారన్నారు. దళితులపై హింసను అరికట్టాల్సిందిపోయి దోషులకు బాసటగా నిలుస్తున్నారని మండిపడ్డారు.

బిహార్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌, హర్యానా రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం సాధించిందంటే బీజేపీ విఫలమైనట్లేనన్నారు. దేశంలో పరిపాలనపై పట్టులేకనే ప్రధాని మోదీ ఉపవాస దీక్ష చేపడుతున్నారన్నారు. దేశవ్యాప్తంగా ఉన్నా దళితులు, బలహీన వర్గాల ప్రజలు, గిరిజనులు, మైనార్టీలు బీజేపీ పాలనపై అభద్రతా భావంతో ఉన్నారన్నారు. ‘ఒక్కటే దేశం.. ఒక్కటే టాక్స్‌’ అని చెప్పిన ప్రధాని పెట్రోలుపై జీఎస్టీ ఎందుకు వసూ లు చేయడం లేదో వివరించాలన్నారు. పెత్తందారులకు జీఎస్టీ వర్తించదా? అని ప్రశ్నించారు.

అప్పుల చేసి డబ్బులు ఎగోట్టి విదేశాలు పారిపోతే ప్రధానమంత్రి, విదేశాంగ శాఖ ఏం చేస్తున్నాయని మండిపడ్డారు. కాంగ్రెస్‌ హయాంలో యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం చేసుకుంటే దాన్ని తిరస్కరించి వేల కోట్లు పెట్టి రిలయన్స్‌కు అప్పగించడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. దేఽశంలో ప్రజలకు అన్యాయం జరిగే అంశాలపై, అధికార పార్టీ వైఫల్యాలపై పీసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఉపవాస దీక్ష చేస్తే అర్థం ఉంటుందని, సాక్షా త్తు ప్రధాని ఉపవాస దీక్షలో కూర్చుంటే దేశప్రజలు తమ సమస్యలను ఎవరికి చెప్పుకోవాలని అన్నారు.

దేశంలో అసమర్థపాలన కొనసాగుతుందని ఒప్పుకోవడం కోసమే ఉపవాస దీక్షకు కూర్చున్నరేమోనన్నారు. ఈ సమావేశంలో పీసీసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఏను గు మనోహార్‌రెడ్డి, కాంగ్రెస్‌ బీసీ సెల్‌ అధ్యక్షుడు ముడికే చంద్రశేఖర్‌, కాంగ్రెస్‌ నాయకులు సాగరం వెంకటస్వామి, ఎర్రం రాజు, చింతపల్లి శ్రీనివా్‌సరావు, చిలుక అంజిబాబు, విష్ణు, రవీందర్‌, చిలువేరి శ్రీనివాస్‌, ముస్కు పద్మ, ఎలిజబెత్‌ చేపూరి గంగాధర్‌ ఉన్నారు.