అమరావతి: డా.బీఆర్ అంబేద్కర్ 127వ జయంతిని ఏపీ ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. అమరావతిలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు.