రామ్ చరణ్, సమంత హీరోహీరోయిన్లుగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం చిత్రం బ్లాక్‌బస్టర్ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సక్సెస్ మీట్‌ని నిర్వహించింది. ఈ వేదికకు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.


ఈ వేదికకు పవన్ కల్యాణ్ కళ్లజోడు పెట్టుకుని వచ్చారు. ఆ కళ్లజోడు పెట్టుకోవడానికి గల కారణం గురించి తెలుపుతూ..‘‘ కళ్లజోడు పెట్టుకుని మాట్లాడడానికి కారణం ఏమిటంటే.. నా కళ్లపై వెలుగు పడకూడదు. చిన్న ఐ ప్రాబ్లమ్ వచ్చింది. అంతేకానీ స్టయిల్ కోసం మాత్రం కాదు..’’ అన్నారు.

సినిమాలు, రాజకీయాల్లోకి రాకముందు
అంబేడ్కర్ గురించి క్షుణ్ణంగా చదివా

నేను సినిమాలు, రాజకీయాల్లోకి రాకముందు అంబేడ్కర్ గురించి పుస్తకాల్లో క్షుణ్ణంగా చదివానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతిని పురష్కరించుకుని హైదరాబాద్‌లోని జనసేన కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పవన్ కల్యాణ్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో పవన్ మాట్లాడుతూ… ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టంపై ఇటీవల సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు బాధాకరమన్నారు. దీనిపై మరోసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే.. అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళతామన్నారు. అండన్ వెళ్లినప్పుడు అంబేడ్కర్ నివవించిన ఇంటిని సందర్శించే భాగ్యం కలిగిందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.