సూపర్ స్టార్ మహేష్ బాబు, కైరా అద్వాని జంటగా నటిస్తున్న సినిమా భరత్ అనే నేను. కొరటాల శివ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్‌, ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీబిజీగా ఉంది.

 

ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ స్పెషల్ అట్రాక్షన్ కాబోతోంది. పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌తో తెరకెక్కిన ఈ సినిమాలో మహేష్ సీఎంగా నటించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ పరంగా దూసుకుపోతోంది. ఎక్కడ.. ఏ బస్టాప్‌లో చూసినా ఈ సినిమా పోస్టర్లే దర్శనమిస్తున్నాయి. ఈనెల 20న ప్రపంచ వ్యాప్తంగా ‘భరత్ అనే నేను’ రిలీజ్ కాబోతోంది.