నీతోనే హాయ్ హాయ్..

 

ప్రముఖ సినీ నటుడు, రంగస్థల నటులు, దర్శకులు, తిరుపతి నివాసి, అభినయ ఆర్ట్స్ అధినేత, నెల్లూరీయుడు శ్రీ బి. ఎన్ రెడ్డి దర్శకత్వంలో కె.యస్ ఆర్ ప్రొడక్షన్స్ నిర్మాణంలో “నీతోనే హాయ్ హాయ్ ..” టైటిల్ తో దాదాపు 87 శాతము చిత్రం పూర్తియింది.బి. ఎన్ రెడ్డి కి చిత్ర రంగంలో ఏంటో అనుభవం వుంది. దాసరి నారాయణరావు వద్ద రెడ్డి గారు పనిచేశారు.
తిరుపతిలో అభినయ ఆర్ట్స్ నాటక కళా పరిషత్ ను స్థాపించి ప్రతి ఏడాది హనుమ అర్డులను కళాకారులకు అందజేస్తూ పౌరాణిక, సాంఘీక , నాటక, నాటిక పోటీలను, సంగీత, నృత్య పోటీలను, బాలల నాటిక, నాటక పోటీలను నిర్వహిస్తూ అందరి అభిమానాలను చూరగొన్నారు. డాక్టరు ఏ యస్ కీర్తి రెడ్డి, డాక్టరు జి. పార్ధ సారధి నిర్మాతలుగా ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. అరుణ్ తేజ్, ఛరిష్మా శ్రీకర్ కథాకథానాయికలుగా నటిస్తున్నారు. నటుడు బెనర్జీ, ఏడిద శ్రీరామ్, జబర్ధస్ టీమ్ పలువులు ఇందులో నటిస్తున్నారు.
ఈ చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అభినయ బి. ఎన్. రెడ్డి అన్నీ తానై క్యూట్ లవ్ స్టోరీతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.