అమరావతి: నాలుగేళ్లు రాత్రింబవళ్లు పనిచేసి రాష్ట్రాన్ని గాడిలో పెట్టామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. జాతీయ అవార్డులు సాధించిన అధికారులను సీఎం సత్కారించారు. దాదాపు 300 మంది అధికారులకు అవార్డులు వచ్చాయి. గుర్తింపు వల్ల మరింత ఉత్సాహం పెరుగుతుందోని చంద్రబాబు అన్నారు. అలాగే వృద్ధిరేటులోనూ దేశంలోనే మన రాష్ట్రం నెంబర్ వన్‌లో ఉందన్నారు. 2022 కంటే ముందే లక్ష్యాలను చేరుకుంటామని చెప్పారు. తాను బృంద నాయకుడిని మాత్రమే… క్రెడిట్ బృందానికే దక్కుతుందన్నారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు.