న‌టుడు నంద‌మూరి హ‌రికృష్ణ హ‌ఠాన్మ‌ర‌ణం యావ‌త్తు తెలుగు ప్ర‌జ‌ల‌ను క‌లిచివేస్తోంది. హ‌రికృష్ణ మ‌ర‌ణ వార్త‌తో తెలుగు సనీ ప‌రిశ్ర‌మ మొత్తం స్థంభించిపోయింది. సినీ ప్ర‌ముఖులంద‌రూ త‌మ త‌మ సోష‌ల్ మీడియా ఖాతాల ద్వారా హ‌రికృష్ణ మృతికి సంతాపం తెలియ‌జేస్తున్నారు.

`ఎన్టీయార్‌` బ‌యోపిక్‌ను రూపొందిస్తున్న డైరెక్ట‌ర్ క్రిష్ కూడా హ‌రికృష్ణ మృతికి సంతాపం తెలియ‌జేశారు. చిన్న వ‌య‌సులో తండ్రి ముందు న‌డుస్తున్న హ‌రికృష్ణ ఫోటోను త‌న ట్విట‌ర్ ఖాతాలో పోస్ట్ చేశారు. `మార్పు కోసం రామ ర‌థ చ‌క్రాలు న‌డిపిన చైత‌న్య ర‌థ సార‌థ్యం.. చిన్న నాటే జ‌నం కోసం తండ్రి ముందు న‌డిచిన వార‌స‌త్వం.. 1962లో దేశ ర‌క్ష‌ణ కోసం విరాళాలు సేక‌రిస్తున్న ఎన్టీయార్ ముందు న‌డుస్తున్న హ‌రికృష్ణ‌` అంటూ క్రిష్ ట్వీట్ చేశారు.