మంచి మాటలు

 

 1. సలహా అనేది ఎవరికి అత్యవసరమో, వారికే రుచించదు.

 2. తనను తాను సంస్కరించుకున్న వ్యక్తి కె ఇతరులను సంస్కరించే అధికారం అందుతుంది.

 3. మన సంతోషం మన తెలివితేట పై అధారపడి వుంతుంది.

 4. కఠోర పరిశ్రమ అనంతరం వరించే విజయం తియ్యగా వుంతుంది.

 5. థైర్యసాహసాలు, ప్రతిభ – ఇవి ప్రతి మానవుడి విజయసాధనకు సోపానాలు.

 6. బాథ్యతానిర్వహణలో మనిషిలో శౌర్యం వెలికివస్తుంది.

 7. మనం ఎంత ప్రశాంతంగా ఉంటే, మన పని అంత ఉత్తమంగావుంటుంది.

 8. మనిషి జీవితంలో ముందడుగు వేయడానికి రెండు కారణాలు-ఒకటి భయం, రెండు శ్రద్ధ.

 9. అఙ్ననం భిన్నత్వానికి,ఙానం అభిన్నత్వానికి దారి చూపుతుంది.

 10. వైఫల్యం నిరాశకు కారణం కాకుడదు. కొత్తప్రేరణకు పునాది కావాలి.

 11. నిరాడంబరత స్నేహితుల్ని పెంచుతుంది.గర్వం శత్రువుల్ని పెంచుతుంది.

 12. సత్యమార్గంలో నడిచేవాడేసంపన్నుడు.

 13. ఆనందాన్ని మించిన అందాన్నిచ్హే సౌందర్యసాధనం మరొకటి లేదు.

 14. దుహ్ఖం అనేది శిక్ష కదు. సంతొషం అనేది వరమూ కదు. రెండూ ఫలితాలే .

 15. స్వర్గాన్ని నరకంగా చేసేది, నరకాన్ని స్వర్గంగా చేసేదీ మన మనసే.

 16. నిర్ణయం తీసుకోవడానికి అనుభవం, ఙానం,వ్యక్తపరిచే సామర్ధ్యం అవసరం.

 17. సర్వమానవ శ్రేయస్సుకు దోహదం చేసేదే నిజమైన సంస్క్ర్రుతి.

 18. మనం ఇతరులకు ఎన్ని సలహాలైనా ఇవ్వవచ్చు. కానీ ప్రవర్తన నేర్పలేం.

 19. థైర్యం,కాలం,ప్రక్రుతి,….ఈ మూడూ ఉతమమైన గొప్ప వైద్యులు .

 20. పరిస్థితులు కాదు మానవుణ్ణి స్రుష్టించింది. మానవుడే పరిస్థితుల్ని స్రుష్టించుకున్నాడు

 21. సంతోషం ఉంటే అన్ని నిధులు ఉన్నట్టే. సంతోషం లేకుంటే ఎన్ని నిధులు ఉన్నా వ్యర్థం.

 22. మనలను తప్పులు పట్టేవారే మనకు గురువులు.

 23. లక్ష్యం లేని జీవితం ఎందుకూ కొరగాదు

24.ఇతరులలో ఎప్పుడూ మంచినే చూస్తూంటే, దు:ఖం మన దరి చేరదు.

 1. బద్దకం మనకు శత్రువే కాదు, పాతకం కూడా

 2. మొదట మనం పరివర్తన చెంది, ఇతరులు పరివర్తన చెందడానికి స్పూర్తి అవ్వాలి

 3. చితి నిర్జీవులను కాలుస్తుందిచింత సజీవులను దహిస్తుంది

 4. కష్టాలు ఒంటరిగా రావు…అవి అవకాశాలను వెంట తీసుకు వస్తాయి

 5. సంసార సాగరం దాటలంటే…సంస్కారముల పరివర్తన కావాలి

 6. కోరికలు పెరిగేకొద్దీ ఆనందం తగ్గుతుంది

 7. దేహ శుభ్రతతో పాటు భావ శుద్దత అత్యంత అవసరం

 8. ఒకరితో ఉన్న బంధం తెగిపోవాలంటే, వారి వైపు వేలెత్తి చూపితే చాలు. హుందాగా తప్పులు అంగీకరించే దొడ్డ 33. మనస్సు చాలా మందికి ఉండదు. మనం తప్పులు చూపిన వెంటనే, వారు కూడా మనలో తప్పులు వెతకడం 34. మొదలు పెడతారు. తప్పులు మాత్రం చూస్తూ ఉంటే బంధం ఎలా నిలుస్తుంది?

 9. పుణ్యాత్ములు దు:ఖాన్ని సుఖంగా, నిందల్ని పొగడ్తలుగా పరివర్తన చేస్తారు

 10. ఎవరైతే సమయాన్ని సఫలం చేసుకొంటారో వారే విజయులై అన్నిట్లోనూ మొదటి స్థానంలో ఉంటారు

 11. బాల్యం విలువ అది గడచిపోతే కానీ తెలియదు. యవ్వనం లో ఉన్న శక్తి అది ఉడిగిపోయేదాకా తెలియదు. సంసార జీవితంలో మన గురించి ఆలోచించే సమయం దొరకదు. జీవితం గురించి అర్థం చేసుకోవాలంటే ఈ జీవితం సరిపోదు…..

38  క్షమాగుణం బలహీనత కాదు. క్షమించడానికి శిఖరమంత మనోబలం కావాలి.

 1. అంతా మన మంచికే . సుఖమైనా దుఖ్ఖమైనా జీవులకు సంబంధించి అనుభవించవలసిందే తప్ప దాన్ని తప్పించుకునే అవకాశం లేదు. ఏమి జరిగిందో అది బాగా జరిగింది, ఏమి జరుగుతుందో అది బాగా జరుగుతోంది, ఏమి జరగబోతుందో అది కూడ బాగా జరుగుతది అనే ఈ జ్ఞానాన్ని మనసులో నిలుపుకున్న మనిషి కష్టాల కడలిలో చిక్కుకున్నా, దుఖ్ఖమనే పెను తుఫాను చుట్టు ముట్టినా, ఆఖరికీ మరణానికి చేరువ కాబోతున్నా గుండె నిబ్బరంతో నిలుస్తాడు. చరిత్రలో విజేతగా మిగులుతాడు. గెలుపు

 2. ఓటమి ఎరుగని వ్యక్తిని అనిపించుకోవడం కన్నా, విలువలను వదులుకోని వ్యక్తిని అనిపించుకోవడం నాకు చాలా ఇష్టం” అన్నాడు ఓ మహావ్యక్తి.అతనే ఐన్ స్టీన్. మనం సాధారణంగా గెలుపు మీదనే శ్రధ్ధ పెడతాము, గెలిచామా లేదా అనేది మనకు ముఖ్యం కాని ఎలా గెలిచామనేది సాధారణంగా పట్టించుకోము. ఐన్ స్టీన్ చెబుతున్నది మాత్రం అది కాదు.ఓటమి ఎదురైనా ఫరవాలేదు విలువలకు మాత్రం ఎక్కడా లోతు రాకూడదని ఆయన అన్నాడు. మహాత్మ గాంధి కూడ అదే అన్నారు.” సిధ్ధి కన్న సాధనలు ముఖ్యం” అని.ఏం సాధించావు అనేదాని కన్నా ఎలా సాధించావన్నది ముఖ్యమని బాపూజీ అభిప్రాయం. ఘోరంగా ఓడిపోయునా పరవాలేదు కాని అడ్డదారులు మాత్రం తొక్కరాదు అని నా అభిప్రాయం.

 3. మంచి మిత్రుడు : లోకంలో మన తల్లి తండ్రుల తరవాత మన హితాన్ని కోరే మూడవ వ్యక్తి మన స్నేహితుడే అన్నాడు శ్రీమాన్ పరవస్తు చిన్న యసూరి గారు. బంధుత్వానికి కులగోత్రాలు కలవాలి కాని స్నేహితానికి అవి అవసరం లేదు.మన స్నేహితుడు మనం పాపకార్యాలు చేస్తుంటే వారిస్తాడు, మన రహస్యాలని బయటకు పొక్కనివ్వడు.మనం కష్టాలలో ఉంటే వదిలి వెళ్ళడు. డబ్బులేక బాధపడుతుంటే సహాయం చేస్తాడు.మంచి మిత్రుడు కంటికి రెప్పలాగ కాపాడుతాడు.  కనుక మంచి మిత్రులను మనము సంపాదించుకుందాము. మనము వారికి మంచి మిత్రులగానే   ఉందాము. మనము అందరము ఈవిధంగా ఉన్నట్లు అయుతే మన సమాజం తప్పకుండా అమౄతవౄక్షం అవుతుంది.

 4. ఆత్మవిశ్వాసానికి మూలం ప్రశాంతతే. సమస్య ప్రతి జీవికి ఉంటుంది.సమస్య లేని జీవి ఉండడు.అది ఏ రూపంలో నైనా ఉండవచ్చు.దీని మూలంగానే ప్రశాంతతకు దూరంగా బతకనక్కరలేదు.ఎన్ని సమస్యలున్నా ప్రశాంతంగా బతకడం నేరిస్తేనే జీవితాన్ని కాచి ఒడబొసిన వాళ్ళమవుతాము.ప్రతికూల పరిస్థితుల్లో సైతం ఎదురొడ్డి పోరాడి గెలుపును సాధించడమే జీవిత పరమార్థం.

 5. సంతృప్తి

మనిషి ఆశకు అంతు ఉండదు. ఎంత ఉన్నా ఇంకా ఏదో కావాలనే కోరిక ఉంటుంది.భగవంతుడు ఇచ్చినదానితో తృప్తి పడడమే మానవ ధర్మం.లేని వాటి కోసం చేతులు చాచకూడదు.ఎంత పుణ్యం చేసుకుంటే అంత ఫలం పరమాత్ముడు ప్రసాదిస్తాడు.ఆయనకు అందరూ సమానమే.

మనిషికి ఆశ ఉండడం తప్పు కాదు కాని అత్యాశ ఉండకూడదు. కోరికలను అదుపులో పెట్టుకోవాలి, లేకుంటే అవి మన జీవితాన్ని నాశనం చేస్తాయి.

అందరికీ అన్నీ ఉన్నాయని బాధ పడకూడదు.మన పనల్లా ఇతరులకు వీలైనంత సహాయం చేయడం,మంచి పనులు చేయడం,మనం చేసిన పని ఇతరులకు సుఖ సంతోషాలను కలిగించాలి. మనం పాప కార్యాలు చేసి బంధనంలో పడేకంటే పుణ్య కార్యాలు చేసి శాశ్వతంగా నిలిచిపోవడమే భావ్యం.అందుకే మనం ప్రతినిత్యం దైవాన్ని ప్రార్థించేముందు ఇచ్చినదానితో సంతృప్తి చెందామని దైవం ముందు తలవంచాలి.

 1. అనుకున్నామని జరగవు అన్నీ… అనుకోలేదని ఆగవు కొన్ని

 2. అక్షరరూపం దాల్చిన ఒక్కసిరా చుక్క, లక్ష మెదళ్ళకు కదలిక.

46.అహంకారం సృష్టించే చీకటిని ఛేదించడం ఎవ్వరికీ సాధ్యం కాదు..

 1. ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో, దాని వల్ల లభించే ప్రతిఫలం అంత తీయగా ఉంటుంది.

 2. అజ్ఞానులు గతాన్ని గురించి, బుద్ధిమంతులు వర్తమానాన్ని గురించి, మూర్ఖులు భవిష్యత్తును గురించి మాట్లాడతారు.

 3. మనం మన కోసం చేసేది మనతోనే ఆంతరించి పోతుంది. ఇతరుల కోసం చేసేది శాశ్వతంగా ఉంటుంది

50 .ఒకరికి మేలు చేసే పని ఏదైనా గొప్పదే. ఒక గొప్ప పనిని నిజాయితీగా చెయ్యాలని ప్రయత్నించే ప్రతి మనిషి గొప్పవాడే.

 1. మన వలన సమాజానికి మేలు జరగక పోయినా పర్వాలేదు. కీడు మాత్రం జరుగకూడదు’

 2. జ్ఞానం అంటే తనను తాను తెలుసుకోవడం .. తనను తాను నియంత్రించుకోగల్గడం.

 3. జ్ఞానానికి, దీపానికి ప్రత్యేక గుర్తింఫు అవసరం లేదు. అవి పాతాళంలో ఉన్నా , దశదిక్కులకు, తమ కాంతులను ప్రసరింపజేస్తూనే ఉంటాయి

 4. ప్రేమ.. డబ్బు.. జ్ఞానం.. చదువు.. దేనికోసమైనా తపనపడుతూ పిచ్చివాడై పోయేవాడికి అది తప్పకుండా దొరుకుతుంది. అందుకోసం మనం కనబరచాల్సిందల్లా ఉడుంపట్టులాంటి పట్టుదల, సంకల్పబలం, శ్రమించేతత్వం.

 5. గొప్ప అవకాశాలే వస్తే ఏమీ చేతకానివారు కూడా ఏదో గొప్ప సాధించవచ్చు. ఏ అవకాశాలూ లేనప్పుడు కూడా ఏదైనా సాధించినవాడే గొప్పవాడు.

 6. ఆత్మవిశ్వాసం లేకపోవడం అనేది క్షమించరాని నేరం. మన చరిత్రలో ఏదైనా సాధించిన గొప్ప వ్యక్తుల జీవితాలను నిశితంగా పరిశీలించండి. వారిని నడిపించింది ఆత్మవిశ్వాసమేనని తెలుస్తుంది. భగవంతుడి పట్ల నమ్మకం లేనివాడు నాస్తికుడనేది ఒకప్పటి మాట. ఆత్మవిశ్వాసం లేనివాడు నాస్తికుడన్నది ఆధునిక మతం.

 7. ఎవరికో బానిసలా కాకుండా నువ్వే యజమానిలా పనిచెయ్యి. నిర్విరామంగా పనిచెయ్యి. బాధ్యత తీసుకో. అది నిజంగా నిన్ను యజమానిని చేస్తుంది.

 8. పనికీ విశ్రాంతికీ మధ్య సరైన సమతౌల్యం ఉండాలి.

 9. పిరికితనానికి మించిన మహాపాపం ఇంకోటి లేదు. ఒక దెబ్బతింటే రెట్టింపు ఆవేశంతో పది దెబ్బలు కొట్టాలి. అప్పుడే మనిషివని అనిపించుకొంటావు. పోరాడుతూ చనిపోయినా పర్లేదు. కానీ పోరాటం అవసరం.

 10. అనంత శక్తి, అపారమైన ఉత్సాహం, అమేయ సాహసం, అఖండ సహనం.. ఇవే మనకు కావాలి. వీటితోనే ఘనతను సొంతం చేసుకోగలం. వెనక్కి చూడకండి. ముందంజ వేయండి.

 11. మనలో ఉన్న పెద్ద లోపమేమిటంటే ముగ్గురం కలిసి పొందికగా ఐదునిమిషాలు పని చేయలేం. ప్రతివ్యక్తీ పెత్తనం కోసం పాకులాడుతుంటాడు. అందువల్లే మొత్తం పని, వ్యవస్ధ చెడిపోతున్నాయి.

 12. మనస్సు, శరీరం రెండూ దృఢంగా ఉండాలి. ఉక్కు నరాలూ ఇనుపకండలూ కావాలి మనకి. మేధస్సుకు చదువులాగా శరీరానికి వ్యాయామం అవసరం. నిజానికి ఓ గంటసేపు పూజ చేసే కన్నా పుట్ బాల్ ఆడటం మంచిది. బలమే జీవితం… బలహీనతే మరణమని గుర్తించండి.

 13. వెళ్లండి. ఎక్కడెక్కడ క్షామం, ఉత్పాతాలు చెలరేగుతున్నాయో అలాంటి ప్రతి ప్రదేశానికీ వెళ్లండి. మీ సేవలతో బాధితులకు ఉపశమనాన్నివ్వండి. వ్యధను తుడిచే ప్రయత్నం చెయ్యండి. ఆ ప్రయత్నంలో మహా అయితే మనం చనిపోవచ్చు. కానీ ఆ మరణం కూడా మహోత్కృష్టమైనది. కూడగట్టాల్సింది సహాయం.. కలహం కాదు. కోరుకోవల్సింది సృజన.. విధ్వంసం కాదు. కావలిసింది శాంతి, సమన్వయం.. సంఘర్షణ కాదు.

 14. పరిపూర్ణత అనేది ఆచరణ నుంచి మాత్రమే వస్తుంది

 15. ఆత్మ విశ్వాసం దెబ్బతింటే సామర్ధ్యం పని చెయ్యదు ,అందుకే ఎప్పుడు ఆత్మ విస్వసాని కోల్పోకండి i

 16. దేనితోను ఎప్పుడు సంతృప్తి పడనివాడు ఎవ్వరిని సంతృప్తి చెయ్యలేడు

 17. ఉన్నదానితో సంతృప్తి చెందితే మంచిదేకని మనకున్న జ్ఞానం చలుఅనుకోవడం అజ్ఞానం

 18. బలం తో గెలవలేనప్పుడు యుక్తి తో గెలవడమే తెలివైన వాడి లక్షణం

 19. సమాజం లో మనం స్నేహపూర్వకంగా మేలిగినప్పుడే మన చుట్టూ వుండేవారు కూడా అలాగే మెలుగుతారు

 20. ఎప్పుడు సుఖంగా సాగుతుంటే కష్టం విలువ తెలియదు,అప్పుడు సుఖం కూడా విసుగనిపిస్తుంది

 21. మహాత్ముల ఆగ్రహం తామరాకు మీద నీటిబొట్టు వంటిది

 22. సమాజం నిన్ను గుర్తించడంలేదు అనడం కన్నా నీవు సమాజాన్ని ఎంతవరకు గుర్తిన్చావో పరీసిలించుకో

 23. విజ్ఞతను మించిన మిత్రుడు, అజ్ఞానాన్ని మించిన శత్రువు లేడు

 24. నిజమైన స్నేహితుడు లేకపోవడమే దుర్బరమైన జీవితం

 25. కోపం మనిషిని అన్ని విదాల నాశనం చేస్తుంది.శాంతం మనిషిని అన్ని వేళల రక్షిస్తుంది

 26. అన్నిటికంటే మేలు చేసే ఏకైక వస్తువు ధర్మం

 27. ఎంత సంపాదించినా కలగని ఆనందం ఒక మంచి మిత్రుడ్ని సంపాదించినప్పుడే కలుగుతుంది

 28. దైవం యొక్క ప్రత్యక్ష స్వరూపమే సత్యం ధర్మం

 29. వివేకియినా శత్రువు కన్నా అవివివేకు డయానా మిత్రుడు ప్రమాదకారి

 30. ఒక్క క్షణం సహనం కొండంత ప్రమాదాన్ని దూరం చేస్తే, ఒక్క క్షణం అసహనం మొత్తం జీవితాన్ని నాశనం చేస్తుంది.

 31. మనశ్శాంతి అన్నది మనీ తో రాదు ,సంతృప్తి అన్న సంస్కారం తో వస్తుంది

 32. కష్టపడాలన్నా ఈ క్షణమే,ఆనందించాలన్నా ఈ క్షణమే,బ్రతకాలన్నా ఈ క్షణమే,బ్రతికించాలన్నా ఈ క్షణమే,

ఎందుకంటే నిన్న నీది కాదు గడిచిపొయింది కాబట్టి, రేపు నీది కాదు ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి

కాబట్టి (ఈక్షణమే) నీకు తక్షణం. యువతకి కావలసింది సోమరితనం కాదు, పనితనం, నీ భవిషత్తు గురించి ఈ క్షణం ఆలోచించూ, నీ స్వశక్తిని ఉపయోగించూ.

83.”అమ్మ” అను పదానికి గణిత నిర్వచనము:

1000 మంది తండ్రులు + 100000 పరమగురువులు + 1000000 సాధారణ గురువులు +..అనంతము వరకు << అమ్మ

అమ్మ ప్రతిక్షణమూ పూజ్యనీయురాలైనప్పటికీ అమ్మలను పూజించుకొనేందుకు, గౌరవించుకొనేందుకు ఒక రోజును కేటాయించినందున

మాతృదినోత్సవ శుభాకాంక్షలు”

మాతృమూర్తులందరికీ అనంతకోటి నమస్కారాలు.

84.మనము వెదికేది మనకు దొరకదు,మనకు దొరికినది మాత్రం కచ్చితంగా మనము వెదికినది మాత్రం కాదు

85.ఆలోచన అవసరం లేకుండా వాస్తవాలు గ్రహించగలం ,కానీ వాస్తవాలు లేకుండా ఆలోచనలు రావు .

 1. జీవితం ఎప్పుడు సుఖంగా సాగుతుంటే కష్టం విలువ తెలియదు,అప్పుడు సుఖం కూడా విసుగనిపిస్తుంది

 2. నిన్ను నీవు తెలుసుకో …వినయమెరిగి మసలుకో ,తొలగిందా నీలోని అహం ,ప్రపంచమే నీకు దాసోహం…

 3. మనిషి తత్వమే మానవత్వం – ఏ జీవికీ లేని ఈ తత్వం అనేది మనిషి కొక్కరికే ప్రాప్తించింది.

జాలి దయాగుణం ధాతృత్వం, సహాయ సహకార భావం సహన శీలం, కరుణ కార్పణ్యం, సంస్కారం భాష భావం స్నేహం, ఆలోచనా గుణం వివేకం, ఆదర్శాలూ ఆశయాలూ, పరిసర జ్ఞానం పరిశీలనా గుణం, ప్రేమ అభిమానం, నీతి నియమాలు ఇవన్నీ ఈ తత్వంలొనివే

మనకి దేవుడు రెండు చేతులు ఎందుకు ఎచ్చాడంటే ఒకటి మనకోసం మరొకటి పక్కవాడి కోసం.

కాబట్టి “ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న” కాబట్టి మనిషి పరిపూర్ణుడు ఎప్పుడు అవుతాడు అంటే రాక్షసత్వం నుంచి మానవత్వానికి ,మానవత్వం నుంచి దైవత్వం లోకి వచినప్పుడు.

మానవత్వాన్ని చూపించటంలో పోటీ ఉండాలి, సేవ లో పోటీ పడాలి.

ఇంకా జాగృతం కావాలి!

 1. పుట్టలోని చెదలు పుట్టదా గిట్టదా అని వేమన మహాకవి చెప్పిన మాటకు అర్ధం తెలియక పోయినా, కనీసం తెలుసుకోవాలని ప్రయత్నించం ఎందుకంటే మన చదువులంత ఇంగ్లిష్మయంకధ ” తన కోసం బ్రతికేవాడు మాములు మనిషి ఇతరులకోసం బ్రతికేవాడు మహానుబావుడు” అన్నాడో మహానుబావుడు. ఈ బిజీ లైఫ్ లో డబ్బు ఫై వున్న శ్రద్ద మరొక దాని ఫై లేదు, కాదంటారా? చివరికి తన గురించి తాను ఆలోచించడానికే టైం మిగల్చడంలేదు. దీనికికారణం అవసరానికి మించి డబ్బు సంపాదించాలనే ఆలోచన . ఒక్కసారి కుడా అవసరానికి మించిన డబ్బెండుకని, ఎవరు ఆలోచించడం లేదు ఒకవేళ అలాంటి ఆలోచన మనసులో కదలినపుడు స్వర్ధమనే ముసుగుతో దాచిపెడుతున్నాము. ఎంతసేపు నేనుకాకుంటే నా కొడుకులు అనుబవిస్తారనే ఆలోచనే తప్ప, అసలా కొడుకులు సోమరిపోతులు కావడానికి వారు సంపాదించే మితిమీరిన డబ్బే అని ఎవరాలోచించడం లేదు .

 2. మిత్రుడ్ని మించిన అద్దం లేదు ,మిత్రుడు లేకుండా ఏఎ మనిషి సర్వ సంపూర్ణుడు కాలేడు

 3. ఒక్కసారి మీ మంచి మనసుతో ఆలోచించండి ఎందుకీ అసమానతలు, అందరం పుట్టింది అమ్మకడుపునుంచేగా కాని, కొందరికి తినడానికి తిండి దొరకడం లేదు మరికొందరికి తికడుపు నింపుకొవడం కొసమె తింటే పది రొట్టెలైనా చాలవు. పంచుకుని తింటే ఒక్క రొట్టె ముక్కైనా కడుపు నిండుతుంది. పంచుకొవడం లో ఉన్న ఆనందం అది. ఈ మానవ సూత్రాన్ని ప్రచారం చెయ్యండి న్న తిండి అరగాడంలేదు. మనిషిలో మానవత్వం కరువౌతుంది మనిషికి మృగానికి తేడా లేకుండా పోతుంది.

92 ఒక మనిషి ఓడిపోవడానికి అనేక కారణాలు వుంటాయి ,అదే మనిషి గెలవటానికి ఒక్క కారణం అదే శ్రమించడం!   అదే వేద మంత్రం !…

 1. మనిషీ దీపమయీన కావాలి .అద్దం అయీనా కావాలి .ఒకటి వెలుగునిస్తుంది .మరొకటి దాన్ని ప్రత్రిబింబిస్తుంది. ప్రతివారు దీపం కాలేక పోవచ్చు ! కాని అద్దం కాగలరు

 2. ఒక స్నేహితుడి కోసం ప్రాణాలు అర్పించడం అనేది ఏమంత కష్టమైన పని కాదు.కాని ప్రాణాలు అర్పించే ఒక మంచి స్నేహితుడిని సంపాదించుకోవడం చాలా కష్టమైన పని

 3. అపజయమే ఆలోచనలకు అంతిమ తీర్పేమి కాదు ..అలుపన్నది గెలుపుని వెతికే నీలో ప్రతిభకు రాదు..పోరాడు…పోట్లాడు…జీవితమను ఆటాడు…గెలుపును వేటాడు..

 4. జీవితంలోని సగం బాధలు ‘సరే’ అని త్వరగాను.. ‘వద్దు’ అని అలస్యంగాను.. చెప్పటం వల్లనే కలుగుతాయి.

 5. నీదనుకోనేది ఇక్కడలేదు. అది గ్రహించేసరికి నీవిక్కడ వుండటం లేదు

 6. ఎదుటివాడు ఇచ్చే గౌరవం మన గొప్పతనంగా భావించకూడదు, అది ఇచ్చే వాడి వినయం అంతే .

99.అదృష్టం అంటే మనం కోరుకున్నదే మనకు దక్కడం !

ఆలశ్యం అంటే మనం కోరుకున్నదానికోసం ఎదురు చూడటం !

విజయం అంటే మనం కోరుకొని ఎదురు చూసి వెనుకడుగు వేయకపోవడం !

విజయం శాశ్వతం కాదు ! అపజయమే అంతం కాదు !

అందుకనే ప్రయత్నాన్ని ఆపకు ఆశతో లక్ష్యాన్ని చేరుకో !

 1. ఒక చెట్టు నుంచి లక్ష అగ్గిపుల్లలు తయారు చేయవచ్చు .ఒక్క అగ్గిపుల్లతో లక్ష చెట్లను కాల్చి వేయను వచ్చు అలాగే మనిషికి లక్ష మంచి ఆలోచనలు ఉండవచ్చు కానీ ఒక్క చెడ్డ ఆలోచన లక్ష మంచి ఆలోచనలను కట్టడి చేయవచ్చు .అందుకే అందరం మంచిని పెంచే మంచి పనులకు ఉద్యుక్తులమవుడం.

101.నిజమైన యోగ్యత నదిలాంటిది లోతు హెచ్చే కొలదీ తక్కువ శబ్దంతో గంభీరంగా ప్రవహిస్తుంది .  – స్వామి వివేకా నంద

102.ప్రపంచంలో మనిషిచేసే ప్రతిచర్యవేనుకా ఆంతర్యం ఉంటుంది .అది అభిమానమైతే దానివెనుక ఇంకా భయంకరమైన స్వార్ధం ఉంటుంది .ఆ స్వార్దానికే ఒక్కొకరు ఒక్కొరకం పేరు పెడతారు .స్నేహమని , ప్రేమని , బాధ్యతని ,బంధమని ,వాత్సల్యమని .

 1. జీవితం సప్తస్వరాల సమ్మేళనం

షడ్రుచుల మృష్టాన్న భోజనం

ఒక్కోసారి అది పెద్ద చదరంగం

నవ్వుతూ ఆస్వాదిస్తే నిత్యనూతనం

యవ్వనమైన,వృద్దాప్యమైన

దేవుడాడే వైకుంఠపాళీ మన జీవిత గమనం

104.Meghaniki asha.. varshamga kuravalani

Varshaniki asha.. varadhaga paaraalani

Vardhaku asha.. Nadiga maaralani

Naaku asha.. ninnu cheraalani!

105.ఎప్పటికి చేరలేను నీ తీరం

ఏనాటికీ తరగదు ఈ దూరం

మరుజన్మకైనా కలిగేనా ఈ ప్రణయం

కడదాక సాగేనా నీకోసం నా పయనం

106.pooja kosam puvvu

nakosam nuvuu

okasari navvu

ade mana lovuu

107.అంతు లేని అనంత సాగరం

అనాది గా ఇంతేనా జీవితం

ఎన్ని ఉన్నా ఏదో కావాలి

ప్రతి బంధం లో ప్రేమ కావాలి

ఏమిటీ స్వార్థం ,ఎందుకీ వెర్రి వ్యామోహం ?

108.ఏమిటో ఈ జీవితం

ఎటు వైపు ఈ పయ

ఓటమి నీ రాత కాదు

గెలుపు ఇంకొకరి సొత్తు కాదు

నిన్న మరచి నేటినే తలచి

శ్రమించు ఆశయం సాధించు!

109.Challani gaali veechina

Kammani patanu vinna

Punnami chandruni choosina

Vennela raatrini choosina

Chakkani jantanu choosina

Muddhula papayini choosina

Kurise chinikunu choosina

Virise poovunu choosina

Naaku gurthosthavu

Nannu muripisthavu

Mymarapisthavu

110.స్త్రీ అనే ఒక అక్షరం కోసం…..

ప్రేమ అనే రెండు అక్షరాలను నమ్ముకొని

భవిత అనే మూడు అక్షరాలను వదులుకొని…

జీవితం అనే నాలుగు అక్షరాలను నాశనం చేసుకోవ

111.ఆశలు అందరికి వున్నా ,వాటిని ఆశయాలు మార్చు కునేది కొందరే ,కలల్ని ప్రేమించాలి ,వాటిని నెరవేర్చుకునే ఆశయాలు కోసమే జీవించాలి ,విజయం కోసం అహర్నిశలు శ్రమించాలి ….

112.కుబేరుని ధనం కన్నా విలువైనది ,దొంగలు కూడా దోచ లేనిది సృష్టి లో అముల్యమైనది …..ఇంకేంటి స్నేహం !….

113.మిత్రుడ్ని మించిన అద్దం లేదు ,మిత్రుడు లేకుండా ఏఎ మనిషి సర్వ సంపూర్ణుడు కాలేడు

114.జీవితం లో దేంతో పెట్టుకున్న కాలం వృధా అవుతుంది కానీ ఆడదానితో పెట్టుకుంటే జీవితమే వృధా అవుతుంది …!….

115.నీ పనిని ప్రేమించు ,

గెలుపు ఓటమిల ప్రసక్తి పక్కనపెట్టు

చేసే పని లో ప్రశాంతత వెదుకు

మనసు నిర్మలం అవుతుంది!

జీవితం సంపూర్ణం అవుతుంది!

116.బహు చిన్నది జీవితం

బహు స్వల్పం ఈ సుదినం

ఈ రోజుకారోజు ఇలా అనుకో నేస్తం

అప్పుడు నీ వివేకం అవుతుంది విశాలం

ఉండదు ఏ కోపం,చిన్నది ఈ జీవితం

ఆస్వాదించు ప్రతీ క్షణం,అమూల్యం ప్రతీ నిమిషం

117.ప్రపంచంలోని చీకటి అంతా ఏకమైన

ఒక్క అగ్గిపుల్ల వెలుగు నిస్తుంది

అలాగే లక్ష్య సాధనకు పట్టుదల తోడైతే

నీ విజయాన్ని ఎవరు ఆపలేరు

118.లక్ష్యం చిన్నదని చిన్న చూపు చూడకు

మనస్పూర్తిగా కృషి చేయి

చిన్న చిన్న గెలుపులు పెద్ద గెలుపులకు పునాది వేస్తాయని

వెయ్యి మలుపులకి కారణం అవుతాయని గుర్తించు

119.అపజయమే ఆలోచనలకు అంతిమ తీర్పేమి కాదు ..అలుపన్నది గెలుపుని వెతికే నీలో ప్రతిభకు రాదు..పోరాడు…పోట్లాడు…జీవితమను ఆటాడు…గెలుపును వేటాడు..

120.ఓడిపోయానని నిరాశచెందకు ఆ ఓటమినుంచే గుణపాఠం నేర్చుకో విజయానికి దాన్నే మార్గంగా చేసుకో

121.అనుకున్నది సాదించాలంటే ….అనుక్షణం శ్రమించాలి

122.సముద్ర కెరటం నాకు ఆదర్శం లేచి లేచి పడుతునందుకు కాదు పడినా లేస్తునందుకు

123.ప్రయత్నం చేసి ఓడిపో ప్రయత్నం చెయడంలో మాత్రం ఓడిపోవద్దు

124.నిన్నంతా గతము నేడంతా సుఖము ఇక రేపటికెందుకు భయము నీదే జయము !!!సాగించుమా పయనము సాగించు అలుపెలేని …. పయనం సాగించు

125.మనం గెలిస్తే చప్పట్లు కొట్టే వాళ్ళు , ఓడిపోతే భుజం తట్టే వాళ్ళు నలుగురు లేనప్పుడు ఎంత సంపాదించినా,ఎంత పోగొట్టుకున్నా పెద్ద తేడా ఏమి ఉండదు.

126..బాధపడటానికి వంద కారణాలు చూపించిన జీవితానికి నవ్వడానికి వెయ్యి కారణాలు వున్నాయని నువ్వు చూపించు నీకు జీవితం ఎంతో అందంగా కనిపిస్తుంది

127.People come to u for what you HAVE

Friends come to u for what you ARE.

128.విజయాన్ని గుండెతో.. హత్తుకునే వాడు

ఓటమి మార్గాన్ని.. మార్చగల వాడు

కన్నీటి భాషను చదవగలిగే వాడు

స్నేహితుడొక్కడు… లేకపోతే

బ్రతికి ఉండటంలో అర్థం ఏమిటి

129.అమ్మ వంటిది ఈ లోకంలో.. ఒకే ఒక్కటి.. మిగిలి ఉంది ..అదే స్నేహం అది భాష లేని మమకారం

అవసరం.. స్వార్ధం.. మోసం.. దయ చేసి ఇవన్ని స్నేహంలో కలపకండి.స్నేహం యొక్క పదానికి పరువు తీయకండి !…..

130.ఒంటరితనాన్ని కూడా తోడుగా మలుచుకోగలిగిన వాడు ఎప్పటికీ ఒంటరి కాలేడు..

131.తప్పటడుగుల బాల్యం…తనివి తీరని యువ్వనం…తప్పించుకొలేని వృద్దాప్యం…

ఈ మూడు కలిపితేనే జీవితం…

132.పెద్దలు చెప్పిన మాట : నాకు దేశం ఏమిచ్చిందని కాదు, దేశానికి నేను ఏమిచ్చానని ఆలోచించాలి !

అది ప్రతి పౌరుడూ తన దేశం గురించి చేయవలిసిన పని !

133.Arrow goes forward only after pulling it to backward

Bullet goes forward only after pressing the trigger backward

so Every human being will be happy only after facing the difficulties in their life path

so dont afraid to face the difficulties ,They will push you forward

134.Three sentences for getting success

Know more than other

Work more than other

Expect less than other

135.If we cannot love the person whom we see ,,how can we love god whom we cannot see

136.నిన్నటినుంచి పాఠం గ్రహించి,రేపటి గురించి కలలుకంటూ ఈ రోజుని ఆనందించు.కేవలం బ్రతికేస్తూ జీవితాన్ని వ్యర్దం చేసుకోకు.ఇవ్వటంలో నీకు అనందం వుంటే ఇస్తూ అనందించు.అలా కాని పక్షంలో నీ అనందానికి అడ్డువచ్చే వారినందరిని నీ దినచర్య నుండి తోలగించు.రాజీపడి మాత్రం బ్రతక్కు”…

137.Believing everybody is dangerous but believing no body is more dangerous

138.మనిషీ దీపమయీన కావాలి .అద్దం అయీనా కావాలి .ఒకటి వెలుగునిస్తుంది .మరొకటి దాన్ని ప్రత్రిబింబిస్తుంది. ప్రతివారు దీపం కాలేక పోవచ్చు ! కాని అద్దం కాగలరు

139.నిన్న నువ్వు అనుకున్నది జరగలేఅదని అలోచిన్చివద్దు

నీ కోసం దేవుడు నేడు అన్నది ఒకటి సృష్టించాడు

కొత్త ఉత్సాహంతో మరో సారి ప్రయత్నిచు ఎన్నో అద్భుతాలు సాధించవచ్చు

ఎవ్వరి తో పోల్చుకోకు ఎవ్వరి తో పోటి పడకు నీకంటూ ఒక చెరగని ఒక ముద్ర వుంది అదే నీ ఆత్మ భలం దాంతో ముందడుగు వేయి నీకు విజయం తధ్యం !…

140.రేపటి ఆశే లేకపోతె నిన్నటి నిరాశకి అంతం లేదు,

నిన్నటి నిరాశకి కారణం లేకపోతె రేపటి ఆశకి పునాది లేదు

నిరాశ అనే నరకానికి రెండు అడుగుల దూరం లో ఉండే స్వర్గం ఈ ఆశ!

141.కొందరు పుట్టుకతో గొప్పవారు, కొందరు పుట్టిన పిదప గొప్పవారవుతారు, మరికొందరి మరణించిన తరువాత గొప్పవారవుతారు.

142.బాధలని బంతిలా ,ఆపదని ఆట వస్తువులా మార్చుకోవాలనే ఆలోచన రావాలి .కష్టాన్ని కొత్త ఆటగా నేర్చుకోవాలని ఆసక్తి కలిగితే జీవితం ఎంతో ఆనందదాయకంగా వుంటుంది

143.సమస్య వెనుక సమాదానం ఉంది

దుఃఖం వెనుక సుఖం ఖాయం

ప్రతి కష్టం గొప్ప మార్పుకు కారణం

ఓర్పు లో వుంది విజయం

144.God may not give everything you DESIRE.

But He will definitely give, what you DESERVE!”

145.మనిషిని అని మాత్రమే గురుతుచేసే ఈ లోకం లో .. ఎవరిని నేను ?

మనసు వుందని వుహించు కున్నాను …అది స్నేహానికి స్పందిస్తుందని తలచాను …

మనిషి లో స్నేహాన్ని చూసాను అని అనుకున్నాను ….అది కేవలం ఒ ఆట అని వుహించలేక పోయాను …

మనసుని పరీక్షించే ఈ లోకాన్ని మరిచి స్నేహ హస్తాన్ని అందుకున్ననని ఆనందించాను …

మోసాన్ని చూసాను …మనసుని చంపుకున్నాను ….మౌనంగా మిగిలను ….దూరం గా వెళుతున్నాను.

146.PREMA

Rendu aksharaala mantram

Mana jeevitalanu marchese oka yantram

Kanniti keratala samudram,Aasalu teeralu cherukune kendram

Rendu jeevitaalanu kalipestundi,Mellaga vacchi vunikine maarchestundi

Ekantam lo gadipina kshanalu,Okarilo okariki naccina lakshanaalu

Ekantam lo gurtuku vacche kshanalu,

Dooram ga vunna tana gurinche alochistundi

Tala nimire vodarpu,Dooram ga vunte nitturpu

Dari ki raavalanna eduruchupu,Noorellu kalisi vundalanna korika

Vasantam la modalai,Sisiram la tyajinchi

Agni laa dahinchi,Daavanalam laa vyapinchi

Daggara vunna dooram vunna,Tana gurinche alochistu

Naa swaasa lo vegam,Tana swaasa to kalavalani

Enno janmala sambandam la anipinchi,Aparichitulani atmiyulaga marchesi

Oka china beejam to,Vata vruksham la maripoyi

Evuru lekapoina anni taanai,Andari to vunna tana gurinche alochinchi

Enni janmalaina tanakai nireekshinchi,Gulabi lo mullala gucchukuni

Mogga nunchi puvvu la maari,Saagaramanta lotunna oo prema

Nee teeru evariki telusamma.

147.’నా ‘ అన్న పదం నాన్నలోని స్వభావ తత్వం కలిగి ఉంటుంది

అది నిన్ను అనుక్షణం క్రమశిక్షణలో నడుపుతూ నీ స్వయం వ్రుది కోరు..

మన” అన్న పదం అమ్మలోని స్వభావ తత్వం కలిగి ఉంటుంది

అది అమ్మ నుంచి వచ్చె కరుణ హృదయం లాగ నిన్ను ఇతరులతో చేర్చుతుంది…

ఈ రెండు పద్దాలు మనిషి జీవితాని శాశిస్తాయి. —

148.నా కన్నుల వెనుక స్వప్నం నీవ్వు

నా మాటల వెనుక మౌనం నీవ్వు

నా శ్వాసల వెనుక స్పందన నీవ్వు

నా విజయం వెనుక శ్రమ వి నీవ్వు

నా భాధల వెనుక కన్నీరు నీవ్వు

నా గమ్యం వెనుక పయనం నీవ్వు

నా రేపటి వెనుక నిన్నటివి నీవ్వు

ఇలా

నేనుగా కనిపించే ప్రతి విషయం లో కనిపించని తోడువి నీవ్వు

149.బాధపడటానికి వంద కారణాలు చూపించిన జీవితానికి నవ్వడానికి వెయ్యి కారణాలు వున్నాయని నువ్వు చూపించు నీకు జీవితం ఎంతో అందంగా కనిపిస్తుంది

150.నిన్నంతా గతము నేడంతా సుఖము ఇక రేపటికెందుకు భయము నీదే జయము !!!సాగించుమా పయనము సాగించు అలుపెలేని …. పయనం సాగించు

151.puvvu puttindi andham kosam andham puttindhi adadhani kosam adadhi puttindhi magadi kosam nuvvu puttindhi na kosam

152.

priyuralu gurunchi oka priyudu cheppe manchi maatalu

======================================================

నీతొ పరిచయం

నీ జ్ఞాపకాలు చాలు,,,,,,,,

నీ జ్ఞాపకలు చాలు నా జీవితానికి,

నీతొ గడిపిన క్షణాలు చాలు నా జన్మకి,

నీ ఊసులు చాలు నా ఊపిరికి,

నీ నవ్వులు చాలు నా ఆనందానికి,

నీ మాటలు చాలు నా చిన్ని గుండె పొంగిపొవటానికి,

నీ చూపు చాలు నా కంటిపాపలకి,

చిన్నప్పుడు ఎన్నొ అడుగులు నేర్పిన నాన్న ప్రేమని కూడా మించిపొయెలా చేశవు నీ ఏడడుగులతొ,

పాలుపట్టిన తల్లిప్రేమను గుర్తుచేశవు, నీ తీపి ప్రేమతొ,

తల్లితండ్రులని తలపించేలా వున్న నీ ప్రేమకన్నా నాకు ఏం కావాలి ఈ జీవితానికి.

153.వెలుగుతున్న దీపమే ఇతర దీపాలను వెలిగించగలదు. నిత్యం నేర్చుకునే వాడే ఇతరులకు నేర్పగలడు.

154.తల్లికి మీరేమిచ్చినా తక్కువే. ఎందుకంటే ఆమె మీకు జీవితాన్ని ఇచ్చింది మరి.

155.పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమే.

 1. ఏకాగ్రత ఉంటే ఏదైనా సాధించగలం. అందుకే మనం చేసే పని మీదే పూర్తి ఏకాగ్రత ఉంచాలి.

 2. ఆలోచనలలో విశ్వాసం, కార్యాలలో ధైర్యం, మాటలలో వివేకం, జీవితంలో సేవా భావం ఎప్పుడూ కలిగి ఉండాలి.

 3. మహాత్ములు మనోబలాన్ని కలిగి ఉంటారు. దుర్భల మనుషులు కోరికలను మాత్రమే కలిగి ఉంటారు.

 4. ఆత్మవిశ్వాసం అనేది అదృష్టం కన్నా గొప్పది. పట్టుదల గల మనిషి అదృష్టం కోసం ఎదురుచూడడు.

 5. . నీ మీద నీకు నమ్మకం లేకపోతే నీవు సాధించగలిగిందేమీ ఉండదు. విజయపథంలో సాగాలంటే ఆత్మవిశ్వాసం పెంచుకోవాలి- స్వామి వివేకానంద

 6. నీవు కావాలన్నది సాధించాలనుకుంటే నీలో ఉన్న శక్తిని విశ్వసించాలి- రాబర్ట్ ఆంథోని

 7. భయం తలుపు తట్టినప్పుడు ఆత్మవిశ్వాసాన్ని మేల్కొలపాలి. అప్పుడు భయం పారిపోతుంది- మార్టిన్ లూథర్ కింగ్

 8. విజయం మన అకుంఠిత విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది.

 9. బలహీనులే అదృష్టాన్ని నమ్ముతారు. ధీరులెప్పుడూ కార్యకారణ సంబంధాన్నే విశ్వసిస్తారు.

 10. ఆత్మవిశ్వాసం మితిమీరితే అహంకారమైనా అవుతుంది లేక అజ్ఞానమైనా అవుతుంది.

 11. ఆత్మవిశ్వాసంతో కృషి చేస్తే మనిషి ఎక్కలేని ఎత్తులు లేవు. అందుకోలేని శిఖరాలూ లేవు.

167.ద్వేషాన్ని ద్వేషంతో ఎదుర్కోలేం. ప్రేమతో మాత్రమే జయించగలం- గౌతమ బుద్ధుడు

 1. కోపం రావడం మానవ సహజం. అయితే దాన్ని ఎప్పుడు, ఎక్కడ, ఎవరి మీద ప్రదర్శించాలో తెలుసుకోవడమే విజ్ఞత- అరిస్టాటిల్

 2. కోపంగా ఉండటం అంటే రగిలే నిప్పును చేతితో పట్టుకోవడంలాంటిది. దానిని ఇతరులపై విసిరే లోపలే నిన్ను దహించి వేస్తుంది- గౌతమ బుద్ధుడు

 3. కోప రంగప్రవేశం చేయగానే వివేకం తెర వెనక్కు వెళ్ళిపోతుంది.

 4. మంచి మనుషుల హృదయాల్లో క్రోధం ఎక్కువ సేపు ఉండలేదు.

172.బలోద్రేకాల కంటే ఉన్నతమైనవి సహనమూ…కాలమూ- లాఫాంటిన్

 1. మనం గతాన్ని మార్చలేము. కానీ భవిష్యత్తుకు సంబంధించిన దిగులు బంగారం లాంటి మన వర్తమానాన్ని పాడు చేస్తుంది- పార్కర్

 2. కాలమే జీవితం. కాలం వృథా చేయటం అంటే జీవితాన్ని వృథా చేయటమే.

 3. ఏ పనైనా మూడు గంటలు ముందైనా పూర్తి చేయొచ్చుగాని, ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకూడదు.

 4. మనకెప్పుడూ తగినంత కాలం ఉండనే ఉంటుంది. కానీ అది జాగ్రత్తగా వినియోగించికోవాలంతే.

 5. చెయ్యవలసిన పని ఆలస్యంగా చేయడం అమాయకత్వం కాని చెయ్యకూడని పని ముందుగానే చేయడం మూర్ఖత్వం.

 6. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడమే సాఫల్యానికి రాచబాట.

 7. కొన్ని సమయాల్లో నష్టపోవడమే గొప్ప లాభం- హెర్బర్ట్

 8. మామూలు మనుషులు సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో ఆలోచిస్తుంటారు. ప్రతిభ గల వారు సమయాన్ని స్సద్వినియోగం కోసం ప్రయత్నిస్తారు.

 9. రోజులు నేర్పజాలని పాఠాలు సంవత్సరాలు నేర్పగలవు- ఎమర్సన్

 10. తేలికయిన హృదయం చాలా కాలం జీవిస్తుంది- స్వామి వివేకానంద

183.లక్ష్యం చేరడం కష్టమైనా అసాధ్యం కాదు. ధైర్యంతో ముందుకు సాగాలి.

 1. ఉత్సాహంతో ఏ పని చేసినా లక్ష్యసాధనలో మనం విఫలమయ్యే ప్రసక్తే ఉండదు- వాల్మీకి

 2. చిన్న చిన్న లక్ష్యాలతో ప్రయత్నాలు మొదలు పెడితేనే భారీ లక్ష్యాలు సాధ్యమవుతాయి- విలియమ్ షేక్ స్పియర్

 3. లక్ష్యం మీద చూపించే శ్రద్ధ, దాన్ని సాధించే విధానాల మీద కూడా చూపించినప్పుడే లక్ష్యసిద్ధి జరుగుతుంది.

 4. జీవితానికి ఒక లక్ష్యమంటూ ఒకటి ఉండాలి. లేకపోతే గమ్యం లేని నదివలె ఎటు ప్రవహించాలో తెలీదు.

 5. మనం చేపట్టిన లక్ష్యం మంచిదైతే చాలదు. నడిచే మార్గం కూడా సరైనది కావాలి- నెహ్రూ

 6. గొప్ప లక్ష్యాన్ని సాధించాలని ప్రయత్నించి విఫలం కావడం నేరం కాదు, గొప్ప లక్ష్యం లేకపోవడం నేరం.

 7. మనం సాధించాలి అనుకున్న విషయాన్ని మర్చిపోవడమే మనం చేసే అతి పెద్ద నేరం- పాల్

 8. వెయ్యి మైళ్ళ ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే ప్రారంభమవుతుంది- జపాన్ సామెత

192.అపజయాన్ని కఠినమైన శ్రమ ద్వారా తునాతునకలు చేయవచ్చు- లేమన్

 1. సాధిందిన దానితో సంతృప్తి పొందడం ప్రారంభిస్తే అక్కడితో అభివృద్ధి ఆగిపోయినట్టే- స్టెఫ్ కెట్టరింగ్

 2. అసమర్థులకు అవరోధాలుగా కనిపించేవి సమర్థులకు అవకాశాలుగా కనిపిస్తాయి- ఠాగూర్

 3. అసాధ్యం అనే పదం ఎంతో జాగ్రత్తగా వాడే వారే విజయవంతమయ్యే వారు.

 4. ప్రణాళికాబద్ధంగా పనిచేసేవాడు జీవితంలో అనేక విజయాలు సాధిస్తాడు.

 5. విజయానికి రహదారి ఎప్పుడూ నిర్మాణంలోనే ఉంటుంది- ఆర్నాల్డ్ పాల్కర్

 6. సుఖ దుఃఖాలపైన ఆధిపత్యం సంపాదించిన వ్యక్తి జీవితంలో విజయానికి చేరువవుతాడు- మోక్షగుండం విశ్వేశ్వరయ్య

 7. మనిషి ఆశావాదంతో జీవించాలి. కృషి ఉంటే ఎవరికైనా, ఎప్పటికైనా విజయం వరిస్తుంది. చీకటిని నిందిస్తూ కూర్చునే కంటే ఓ కొవ్వొత్తిని వెలిగించే చొరవ తీసుకోవాలి. అప్పుడే జీవితంలో ఏదైనా సాధించే నేర్పు అలవడుతుంది- మోక్షగుండం విశ్వేశ్వరయ్య

200.స్వయంకృషితో పైకి వచ్చిన వ్యక్తి దగ్గర అదృష్టం గురించి మాట్లాడలేము.

 1. నువ్వెంత కష్టపడి పని చేస్తావో చెప్పొద్దు. ఎంత పని పూర్తయిందో చెప్పు- బెర్నార్డ్ షా

 2. పనిలో కష్టం కూడా సుఖాన్నిస్తుంది- మోక్షగుండం విశ్వేశ్వరయ్య

 3. కష్టపడి పని చేసినవాడే విశ్రాంతిని పూర్తిగా అనుభవించగలడు.

 4. గొప్ప పనులు బలంతో కాదు, పట్టుదలతో సాధ్యమవుతాయి.

 5. ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి ఎదగడానికి ఎన్ని మార్గాలున్నాయో అన్నీ వినియోగించుకోవడమే వివేకం.

 6. మీకు ఇష్టమైన దాన్ని అందుకోవడానికి కృషి చేయకపోతే అందుబాటులో ఉన్నదాన్నే ఇష్టపడాల్సి వస్తుంది.

 7. ఒక శాతం ప్రేరణను, తొంభైతొమ్మిది శాతం శ్రమను ప్రతిభ అంటారు- రోస్ పాల్

 8. కష్టపడి పనిచేయడం+ ఆత్మవిశ్వాసం+ నిరంతర సాధన+లక్ష్యం వైపే పయనం= విజయం.

 9. పని సాధించడానికి సాధనలపై గురి ఏర్పరుచుకోవాలన్నదే నేను జీవితంలో నేర్చుకున్న అతి గొప్ప పాఠం- స్వామి వివేకానంద

 10. బద్ధకంలో దారిద్ర్యం ఉంది. కృషిలో ఐశ్వర్యం ఉంది.

 11. సోమరితనం ఒక రాచపుండు వంటిది. ఒకసారి సోకిందంటే ఆ వ్యక్తి ఇక బాగుపడలేడు

212ఓర్పు చేదుగానే ఉంటుంది. కానీ దాని ఫలితం మాత్రం ఎంతో మధురంగా ఉంటుంది- రూసో

 1. ఇతరుల తప్పులను క్షమించడానికి మొదటి మెట్టు, వాటిని భరించగలగడం.

214.నీ ప్రయత్నం నువ్వు చేయి. ఫలితం గురించి ఎక్కువగా ఆలోంచించకు. ఎందుకంటే అది మంచైనా సరే, చెడైనా సరే తప్పకుండా వస్తుంది. ఓడితే మళ్ళీ ప్రయత్నం చేయాలి. లేకపోతే పతనం తప్పదు.

 1. ఓటమి అంటే ఆ పనిని అంతటితో ఆపివేయమని కాదు దాని అర్థం. ఆ పనిని మరింత పట్టుదలతో, నేర్పుతో విజయవంతం చేయమని దాని అర్థం.

 2. ఓడిపోగానే ఒక వ్యక్తి చరిత్ర ముగిసిపోదు. పారిపోయినప్పుడు మాత్రమే అలా జరుగుతుంది- రిచర్డ్ నిక్సన్

 3. జీవితంలో వైఫల్యాలు భాగమని గ్రహించేవారు వాటి నుండి గుణపాఠాలు నేర్చుకోవచ్చు- ఠాగూర్

 4. ఓటమి కుంగిపోవలసింది కాదు, మరింత మెరుగైన స్థితికి చేరుకోవడానికి పనికివచ్చే నిచ్చెన అది.

 5. అపజయం వల్ల నిరాశకు గురికావచ్చు. కానీ మళ్ళీ ప్రయత్నం చేయకపోతే పతనం తప్పదు- బెవర్లీ సిల్స్

 6. జీవితంలో విఫలమైన వారు ఓడిపోరు, మధ్యలో వదిలేస్తారంతే- పాల్.జె.మేయర్

 7. గెలవాలంటే ఓటమికి కారణాలు తెలియాలి- నెహ్రూ

 8. కష్టపడకుండా విజయాన్ని ఆశించడం ఎడారిలో మంచినీళ్ళ కోసం వెదకడం లాంటిది.

 9. ఒక పెద్ద పనీని అసంపూర్ణంగా చేయడం కన్నా ఒక చిన్న పనిని పరిపూర్ణంగా చేయడం ఉత్తమం.

224.వివేకం ఉత్తములను నడిపిస్తుంది. అనుభవం మధ్యములను నడిపిస్తుంది. అవసరం అధములను నడిపిస్తుంది.

 1. అజ్ఞానం కన్న నిర్లక్ష్యం ఎక్కువగా కీడు చేస్తుంది.

 2. మనిషికి నిజమైన పెట్టుబడి డబ్బు కాదు. సరైన ఆలోచన.

 3. వివేకవంతుడు ముందు ఆలోచించి తరువాత మాట్లాడుతాడు. అవివేకి ముందు మాట్లాడి తరువాత ఆలోచిస్తాడు- డెవిలే

 4. జరిగిపోయిన దాని గురించి బాధపడకూడదు. జరిగిన దాని ద్వారా జరగబోయే దాని గురించి ఆలోంచించాలి.

 5. ఏదైనా ఆలోచించాకే నిర్ణయం తీసుకోండి. నిర్ణయం తీసుకున్నాక ఆ

230.అంతా మన మంచికే అనుకోవడంవల్ల లాభం ఏమిటంటే మనకు కష్టం కలిగిందన్న బాధ ఉండదు. అంతే కాదూ భవిష్యత్ లో మంచి జరుగుతుందనే భావంతో ఉంటాం కాబట్టి మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఇది మన జీవితంలో సానుకూల దృక్పథాన్ని అలవర్చుకోవడానికి దోహదపడుతుంది

231.మన ప్రవర్తనే మనకు మిత్రులనుగానీ, శత్రువులనుగానీ సమకూరుస్తుంది.

232.కదలకుండా కూర్చుంటే కల కరిగిపోతుంది. ఆచరణకు పూనుకుంటే స్వప్నం సాకరమవుతుంది

233.కోపం మరో వ్యక్తికి హానికలిగించేందుకు ముందే నీకు హాని కలుగజేస్తుంది

234.లోకంలో ఎప్పుడూ ద్వేషాన్ని ద్వేషంతో ఎదుర్కోలేం. ప్రేమతో మాత్రమే ద్వేషాన్ని ఎదుర్కోగలం— గౌతమబుద్దుడు.

235.ప్రతి పక్షికి కావల్సిన ఆహారాన్ని భగవంతుడు ఇస్తాడు. అంతేగాని దాని నోటికి ఆహారాన్ని అందివ్వడు

236.మనం కావాలని ఇతరుల్ని దూరంగా ఉంచినప్పుడు ఒక శక్తి సమకూడినట్లుండి,సంతోషంగా ఉంటుంది.కానీ ఇతరులు మనల్ని దూరంగా ఉంచుతున్నారని అనిపించినప్పుడు ఒంటరితనం బాధిస్తుంది.బలహీనత ఏర్పడి,దుఃఖం వస్తుంది. ఆలోచనలతో మనంసృష్టించుకొనే గోడల్నిపైకి లేవకుండా ఎప్పటికప్పుడు చూసుకోవచ్చు.—జిడ్డు క్రిష్ణమూర్తి

237.కోరికల్ని సృష్టించుకుంటూ, వాటికి లొంగిపోతూండటం,వాటిని నెరవేర్చుకోవాలని తాపత్రయపడటం ఒకవిధంగా మానసిక పరాధీనతే. కొందరు వ్యక్తులుగాని, కొన్ని వస్తువులుగాని దగ్గర లేకపోతే బ్రతకలేమనుకోవడం కూడా పరాధీనతే. వ్యక్తులమీదా,వస్తువులమీదా,మానసికంగా ఆధారపడటమే సమస్యల్ని సృష్టిస్తుంది,మనశ్శాంతి లేకుండా చేస్తుంది.—జిడ్డుక్రిష్ణమూర్తి

238.కష్టాలను తప్పించుకునేవారికంటే వాటిని అధికమించేవాళ్ళే విజయం సాధించగలరు.– మహాత్మాగాంధీ

239.వెచ్చదనం మైనాన్ని కరిగించినట్లే సభ్యతాసంస్కారాలు ఎదుటివారి మనసులను కరిగిస్తాయి

240.పక్షులు పాదాల కారణంగా చిక్కుల్లో పడితే , మనుషులు నాలుకలు కారణంగా చిక్కుల్లో పడతారు.

241.పగ తీర్చుకుంటే ఆరోజు మాత్రమే ఆనందం కలుగుతుంది. ఒకరోజు ఆనందం కోసం చిరకాలం కలిగే ఆనందాన్ని బలిపెట్టకూడదు.–తిరుక్కురళ్.

242.మీకు కాలం అనుకూలంగా లేనప్పుడు, మీరే కాలానికి అనుకూలంగా మెలగండి

243.ఏమీ తెలియనప్పుడు మౌనంగా ఉండాలి. అలాగే అన్నీ తెలిసినప్పుడు కూడా

244.పిల్లలకు తల్లిదండ్రులిచ్చే అతిపెద్ద బహుమానామేమిటంటే వారిద్దరూ అన్యోన్యంగా ఉండడమే.

245.ఆకలి తీర్చే అన్నదాత కంటే అజ్ఞానం పోగొట్టే జ్ఞానదాత మిన్న

246.ఒక ఇంట్లో కుటుంబసభ్యులు పరస్పరం ప్రేమను కలిగి ఉండకపోతే ఎన్ని విద్యుద్దీపాలు ఉన్నా వెలుతురు లేనట్లే. ఈ భావం ప్రపంచం అంతా విస్తరించాలని దేశ దేశాల మధ్య అంతరాలు తొలిగి ఐకమత్యం ఏర్పడాలని ఆ దేవుడ్ని ప్రార్ధిద్దాం

247.జీవితం అంటే ‘భౌతిక సుఖాలు మాత్రమే ‘ అన్నభావం నుంచి బయటపడి ఈర్ష్య, ద్వేషం వంటి వాటిని నిగ్రహించుకోగల్గితే ఎదుగుతాము.

248.ఎవడు సమస్త ప్రాణుల యొక్క సుఖదుఃఖాలను తనవిగా చూచుకుంటాడో, అలాంటివాడు అందరిలో నాకు ఎక్కువ ప్రియతముడు.——- శ్రీకృష్ణుడు

249.కర్మ సిద్ధాంతాన్ని తెలుసుకున్న వాడు … హింసకు దూరంగా ఉంటాడు ! పునర్జన్మ సిద్ధాంతాన్ని తెలుసుకున్న వాడు … పరిస్థితులకు ఆవల ఉంటాడు !

250.విజయం ఒక గమ్యం కాదు గమనం మాత్రమె ఎన్నిసార్లు ఓడినా మళ్లీ గెలవడానికి అవకాసం ఉంటుంది..- జార్జ్ ఇలియట్

251.సంపదతో సంబంధం లేకుండా సాటి మనిషి పట్ల ప్రేమను చూపించాలి… – గౌతమ బుద్ధుడు

252.శాంతంగా, నిబ్బరంగా ఉండటమే నిజమైన శక్తికి నిదర్సనం..- స్వామి వివేకానంద

253.ఏది తప్పో ఏది ఒప్పు మీ అంతరాత్మ చెబుతూనే ఉంటుంది తెలియదనడం వట్టి వంచన – చలం

254.ఆవేశాలు చెలరేగినప్పుడు మేధావికి మౌనమే శరణ్యం..- నేతాజీ సుభాష్ చెంద్రబోస్

255.ఈ విశ్వ సౌభాగ్యానికి విద్యార్ధులే పట్టుగొమ్మలు..- రవీంద్రనాద్ ఠాగూర్

256.తాను సర్వజ్ఞాడినని విర్రవీగేవాడే అందరికన్నా మూర్ఖుడు.. – చాచాజీ జవహర్లాల్ నెహ్రు

257.ఉదయం కానేకాదనుకోవడం నిరాశ ఉదయించిన ఉదయం అలానే ఉండాలనుకోవడం దురాశ..- కాళోజి

258.ఏ విషయంలోనూ, ఎట్టి పరిస్థితిల్లోను ఇతరులతో పోల్చి చూసుకోకండి. ఎందుకంటే ‘పోలిక’ అనేది విషతుల్యమైనది. అలా ‘పోల్చుకోవటం’ ద్వారా మీదైన ప్రత్యేకమైన ‘అత్యద్భుతమైన సృజనశక్తి’ ని మీరు కించపరుస్తున్నారు. అందువల్ల ‘పోలిక’ ను త్యజించి, మీవైన విలక్షణమైన ప్రతిభా సామర్ధ్యాలను మీ శక్తి మేరకు వినియోగించండి … వికసించనియ్యండి ! —– సేత్

259.ప్రపంచంలో అత్యంత లోతైనది సాగరం కాదు జీవితం.. సాగరాన్ని కష్టమైనా ఈదవచ్చేమో కాని సంసార సాగరాన్ని ఈదడం చాలా కష్టం .

260.మనది అనుకునేది.. మనది కాదు అనుకునేది ఏది మనది కాదు.. అది అర్ధం చేసుకుంటే ఏ బాధా లేదు

261.జననం మరణం అనే ఎత్తుగా ఉండే రెండు పర్వతాల మధ్య మనం గమనాన్ని సాగించే వారధి జీవితం

262.మంచి చెప్పేది మనకన్నా చిన్నవాడైనా చెవికి ఎక్కించుకోవాలి.. చెడు చెప్పేది మనకన్నా పెద్దవారైనా పెడచెవిన పెట్టాలి

263.ఏది తప్పు.. ఏది ఒప్పు.. ఏది ముప్పు.. అనేది మన మనసుకి ముందే తెలుసు ఏదైనా పని చేసే ముందు మనల్ని మనం ప్రశ్నించుకుంటే తప్పులే చేయకుండా జీవించవచ్చు ఇది కష్టమే కాని అసాధ్యం కాదు

264.అసత్యం పలకడం తప్పు కాని ముప్పు నుంచి తప్పించుకునే పరిస్థితులలో ఆ తప్పు చేయడం తప్పేమీ కాదు

265.సముద్రంలో నీళ్ళెన్నివున్నా లోనికివస్తే తప్ప ఓడను ముంచలేవు.అన్ని రకాలైన వత్తిడులు మనల్ని బాధించలేవు, వాటిని లోనికి రానిస్తే తప్ప

266.కొంత మంది నిరంతరం ఎదుటివారినడిగి తమకు కావలసినవన్నీ సమకూర్చుకుంటుంటారు. అంతే కానీ తమకు తాముగా సంపాదించటం, ఖర్చు పెట్టడం అనేవి చేయరు.

267.నా నమ్మకం ఒక్కటే ! మనిషిగా పుట్టడం ఒక అదృష్టం. మనం మనకోసమే కాదు, మన చుట్టూ ఉన్న వాళ్ళ కోసమూ బ్రతకాలి. అప్పుడే మన జీవితానికి విలువ.

268.మాట్లాడడానికి ముందు శ్రద్ధగా విను. వ్రాయడానికి ముందు సావకాశంగా ఆలోచించు. వెచ్చించడానికి ముందు సంపాదించు. పెట్టుబడి పెట్టేముందు విచారించు. ఆక్షేపించేముందు బాగా ఆలోచించు. విలియం ఆర్థర్ వార్డ్

269.మన సమస్యలకు పరిష్కారాలు మనదగ్గరే ఉంటాయి . కానీ మనం, ఎవరో వచ్చి వాటిని పరిష్కరిస్తారని అనుకొంటామంతే. షేక్స్ పియర్.

270.మనలో ఉన్న పెద్ద లోపమేమిటంటే ముగ్గురం కలిసి పొందికగా ఐదునిమిషాలు పని చేయలేం. ప్రతివ్యక్తీ పెత్తనం కోసం పాకులాడుతుంటాడు. అందువల్లే మొత్తం పని, వ్యవస్ధ చెడిపోతున్నాయి.

అప్పటి రోజుల్లో కూడా ఒకే లక్ష్యం వైపు పయనిస్తూ ఆదిపత్యం కోసం గ్రూపులు, ముఠాలు అంటూ కొట్టుకున్నారని వింటుంటే “మార్పు” ఎప్పటికీ రాదు అనిపిస్తుంది.

271.పిరికితనానికి మించిన మహాపాపం ఇంకోటి లేదు. ఒక దెబ్బతింటే రెట్టింపు ఆవేశంతో పది దెబ్బలు కొట్టాలి. అప్పుడే మనిషివని అనిపించుకొంటావు. పోరాడుతూ చనిపోయినా పర్లేదు. కానీ పోరాటం అవసరం.

272.ప్రేమ.. డబ్బు.. జ్ఞానం.. చదువు.. దేనికోసమైనా తపనపడుతూ పిచ్చివాడై పోయేవాడికి అది తప్పకుండా దొరుకుతుంది. అందుకోసం మనం కనబరచాల్సిందల్లా ఉడుంపట్టులాంటి పట్టుదల, సంకల్పబలం, శ్రమించేతత్వం

273.మనలో నిజాయితీ వుంది అని అనుకున్నప్పుడు ఎవరికీ భయపడ వలసిన పని లేదు. మన కోసం కానీ, సమాజం కోసం కానీ, జీవితం అంటే నిరంతర పోరాటమే.

274.గెలుపు ఓటమి వేరు వేరు కాదు.ఒకే ప్రయాణంలోని మజిలీలు.అందుకే దామస్ ఆల్వా ఎడిసన్ ‘ఎవరన్నారు నేను ఏడు వందల సార్లు విఫలమయ్యానని?నిజానికి ఒక్కసారి కూడా విఫలం కాలేదు.ఆ ఏడు వందల ప్రయత్నాలలో బల్బు వెలగకపోవటానికి ఏడు వందల కారణాల్ని గుర్తించగలిగాననీ చెప్పాడు

275.శాస్త్ర విజ్ఞానాన్ని ఎవరు విస్మరించగలరు? ప్రతి మలుపులోనూ విజ్ఞానమే ఉపకరిస్తుంది. శాస్త్ర పరిజ్ఞానం ఉన్న వారిదే భవిష్యత్తు – జవహర్ లాల్ నెహ్రూ.

276.సమస్యకు మూలం తెలిస్తే పరిష్కారం సులభం.

277.దీపావలి అంటే స్వాతంత్ర్యపు వెలుగు. ఆ వెలుగు నిరంకుశత్వం నుంచి, మానవుల మధ్య కల్పించిన కృత్రిమ విభజన నుంచి లభించే స్వాతంత్ర్యం – స్వామి వివేకానంద.

278.మన ఆలోచనలే మనం ఏమిటి అనేది రూపొందిస్తాయి. అందువల్ల మొదట ఆలోచనలు సవ్యంగా ఉండేలా చూసుకోవాలి – స్వామి వివేకానంద.

279.చెడ్డవారంటూ విడిగా ఉంటే వారిని విడదీసి హతమార్చవచ్చు. కాని మంచినీ చెడుని విభజించే రేఖ మనగుండెకాయ మధ్యగా వెళుతున్నది. ఆ చెడు భాగాన్ని ఎవరు తుంచేసుకోగలరు? – అలెగ్జాండర్ సో్ల్జెనిత్సిన్‌.

280.మానవత్వంపై నమ్మకం కోల్పోకూడదు. సముద్రంలోని కొన్ని చుక్కల్లో కాలుష్యం చేరినంత మాత్రాన సముద్రమంతా కలుషితం కాదు. మానవత్వం కూడా ఒక సముద్రం వంటిది – మహాత్మా గాంధీ.

281.అసమర్ధతకు అహింస అనే ముసుగు కప్పుకునే కన్నా, మనసులో దాగిన హింసా భావనను వ్యక్తీకరించడమే మంచిది – మహాత్మా గాంధీ.

282.మిత్రుడిగా నటించే శత్రువు మహా ప్రమాదకారి – మహాత్మా గాంధీ.

283.మతం అనేది ఒక భ్రమ. మనం ఎలా కోరుకుంటే దానికి అనుగుణంగా ఇమిడిపోవడమే దాని బలం – సిగ్మండ్ ఫ్రాయిడ్.

284.జీవితంలో పరమోన్నత లక్ష్యం చేరాలనే ఆకాంక్షలు మన అందరికీ ఉంటాయి. కానీ ప్రపంచాన్ని నియంత్రించే సంపన్నులు వాటిని వక్రీకరిస్తుంటారు – రవీంద్రనాధ్ ఠాగూర్‌.

285.మనలోని దుర్గుణం ఏమిటంటే మనం చూసిన దానికంటే విన్నదానికే ఎక్కువ ప్రాముఖ్యం ఇచ్చి సంతృప్తి చెందుతాం – హెరొడొటస్.

286.మానవుణ్ణి గురించిన భావనే ఒక నాగరికత స్వభావాన్ని నిర్ణయిస్తుంది – సర్వేపల్లి రాధాకృష్ణన్‌.

286.ఒకరోజు నీవు ఎదుటివాడికి పాఠం చెబుతావు. మరోరోజు ఎదుటివాడు నీకు పాఠం చెబుతాడు. అదే చదరంగం – బాజీ ఫిషర్.

287.భౌతిక జ్ఞనమేమిటో తెలియనివాడు ఆధ్యాత్మిక జ్ఞానం సంపాదించలేడు – బంకిం చంద్ర చటర్జీ.

288.జీవితంలో అనుకున్నది సాధించడానికి దృఢనిశ్చయం, దీక్ష, క్రమశిక్షణ అవసరం

289.ఎలాంటి కష్టాల్లోనైనా ఒక అవకాశం చిగురిస్తుంది – ఆల్‌బర్డ్ ఐన్‌స్టీన్‌.

290.వ్యక్తిలో జ్ఞనం లేకున్నా నైతికత ఉంటే అదే అతని గొప్పతనాన్ని చాటుతుంది – ఉడీ అలెన్‌, సినీ దర్శకుడు.

291.అనిశ్చితి తొలగించటానికి సృజన ముఖ్యం. దీనితోనే ధీరత్వం వస్తుంది – ఎరిక్ ఫ్రామ్‌.

292.వెయ్యి తుపాకుల కంటే వ్యతిరేకించే నాలుగు వార్త్తాపత్రికలకు భయపడాలి – నెపోలియన్‌.

293.మనిషి ఆకలితో ఉన్నప్పుడు అభిమానం, కులం, విద్య, జ్ఞనం, హోదా, అనురాగం అన్నీ మరచి పోతాడు – రోగర్ మార్టిన్‌.

294.బల ప్రయోగం ద్వారా శాంతి నెలకొనదు. అవగాహన ద్వారా మాత్రమే సాధ్యం – ఆల్‌బర్డ్ ఐన్‌స్టీన్‌.

295.స్వేచ్చ అంటే బాధ్యత. అందుకే చాలా మంది భయపడతారు – బెర్నార్డ్‌ షా.

296.ప్రమాదకరమైనప్పటికీ మన నాలుకలాగా పెన్నును స్వేచ్చగా ఉపయోగించడం మన సహజ హక్కు – వోల్టేర్.

297.పాలకుడి నిరంకుశత్వంకన్నా పౌరుల నిరాసక్తత ప్రజాస్వామ్యానికి ఎక్కువ కీడు చేస్తుంది – మాంటెస్క్యూ.

298.అస్తమానం ఎదుటివారిని అంచనా వేయటంలోనే మునిగి తేలితే.. ఎవరితోనూ ఎన్నటికి స్నేహం చేయలేము – మధర్ థెరిస్సా.

299.మానవులకు ప్రకృతికి మధ్య సామరస్య సంబంధం ఉండాలి. మనం ప్రకృతి హంతకులుగా మారడం వల్లనే వినాశక పరిస్థితులు ఏర్పడుతున్నాయి – సుందర్‌లాల్ బహుగుణ.

300.వ్యక్తులలో ఉన్మాదం అరుదు. అయితే సమూహాలు, రాజకీయ పక్షాలు, జాతులు, యుగాలలో అది ఒక నియమం – ఫ్రెడరిక్ నీషే.

301.నేటి బాధ్యతలను అకుంఠిత దీక్షతో నెరవేరిస్తే రేపటి కర్తవ్యమేమిటో గ్రహించడానికి అట్టే ఇబ్బంది ఉండదు – సర్దార్ పటేల్.

302.ప్రభుత్వంలో అందరి భాగస్వామ్యం ఉన్నప్పుడే, స్వేచ్చా సమానత్వాలు సాధ్యమవుతాయి – అరిస్టాటిల్.

303.మనిషి చనిపోయిన తరువాత నిలిచేదే నిజమైన కీర్తి. చితిమంటలు ఆరిన తరువాత కీర్తి జ్యోతులు వెలుగుతాయి – విలియం హాజిలిట్.

304.కోపం తెలివితక్కువ తనంతో ప్రారంభమై, పశ్చాత్తాపంతో అంతమౌతుంది – పైథాగరస్.

305.ఎవరైతే తమను తాము గొప్పగా బావించుకుంటారో వారు ఏ పనినీ సక్రమంగా చేయలేరు – డగ్లాస్ ఆడమ్స్‌.

306.మీ మిత్రుల ఆత్మీయతను… గట్టిగా మనసుకు హత్తుకోండి. ఇనుపకచ్చడాలతో బంధించి మరీ భద్రపర్చుకోండి – షేక్స్‌పియర్.

307.స్నేహబంధాన్ని మెలమెల్లగానే బలపడనివ్వు… ఆ తర్వాత మాత్రం దానిని మరింత బలీయంగా… సుదృఢంగా కొనసాగించాలి – సోక్రటీస్.

308.నీవు ఎంత ప్రయత్నించినా ఎవరూ స్నేహితులు కావడం లేదంటే… ఇక చేయాల్సిందేం లేదు.. నీవు మారడం తప్ప.

309.జరిగేదంతా మంచికే అని స్వాగతించడం మంచిదే కాని… అదే జీవనసూత్రంగా చేసుకుని కూర్చోకూడదు.

310.మనం ప్రయత్నిచాల్సిన దారి సిద్ధంగానే వుంటుంది.. ఎటొ్చ్చీ దాన్ని మనం ఎంచుకోవడంపైనే… ప్రయాణం ఆధారపడి వుంటుంది.

311.మనలో ఎన్ని భయాలు వున్నప్పటికీ అవి మనల్ని గెలవలేవు… మనం వాటికి అవకాశం ఇస్తే తప్ప…

312.ప్రేమతో పరిపాలించడం మానవత్వం, అన్యాయంతో పాలించడం అనాగరికం – ప్రేమ్‌చంద్.

313.ఎప్పుడూ ఒకరికి ఇవ్వడం నేర్చుకో, అంతేకాని తీసుకోవడం కాదు. అలాగే ఒకరికి సేవ చేయడం నేర్చుకో, అంతేకాని ఒకరిపై పెత్తనం చేయడం కాదు – రామకృష్ణ పరమహంస.

314.ఈ ప్రపంచ పర్వదినానికి మీరు ఆహ్వానితులు. మీ జీవితమే అనుగ్రహపాత్రమైనది – రవీంద్రనాథ్ ఠాగూర్.

315.ప్రశాంతత లేని వారు ఎదుటివారి మాటలను ఎప్పటికి అర్ధం చేసుకోలేరు – ఎల్బర్డ్ హబ్బర్డ్.

316.మీ మాటతీరే మీకు మిత్రులను, శత్రువులను సంపాదించి పెడుతుందని తెలుసుకోండి. అందుకే మీరు ఒక మాట మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడండి. మన నాలుక కత్తికాకపోయినా దానికి కోసే శక్తిమాత్రం ఉందని మరిచిపోకండి – అబ్దుల్ కలాం.

317.మూర్ఖులు, ఉన్మాదులు స్థిర చిత్తంతో వ్యవహరిస్తారు. కానీ తెలువైన వారు సందేహాలతో తటపటాయిస్తుంటారు. ఈ ప్రపంచాన్ని పీడిస్తున్న సమస్య ఇదే! – బెర్ట్రండ్ రస్సెల్.

318.శారీరక సామర్ధ్యం ద్వారా మనకు బలం రాదు. అణిచిపెట్టలేనంతటి ఆత్మబలం ద్వారానే అది లభిస్తుంది – మహాత్మా గాంధీ.

319.సమస్యను సృష్టించిన రీతిలోనే ఆలోచిస్తూ ఉంటే పరిష్కారం సాధ్యం కాదు – ఐన్‌స్టీన్.

320.ఏదైనా కార్యం ప్రారంభించే ముందు ఎందుకు చేస్తున్నాను? దాని ఫలితమేమిటి? కృతకృత్యుడిని అవుతానా? అనే మూడు ప్రశ్నలు వేసుకోవాలి – చాణక్తుడు.

321.ఆటలు మానవుల వారసత్వ సంపద. అవి లేని లోపం పూరించలేనిది – క్యూబెర్టిన్.

322.తెలివిలేని నిజాయితీ బలహీనం, నిరుపయోగం. నిజాయతీ లేని తెలివి… భయానకం, ప్రమాదకరం.

323.మనలోని శాక్తి ఏమిటో మనం గ్రహించాలి. మనకు సంబంధించి బయట ఉన్న శాక్తి గురించి ఆలోచించకూడదు. 324.మనలో ఎంత బలమైన ఆలోచన ఉందో.. ఆ ఆలోచన దిశగానే జీవితం సాగిపోతుంది. అది మంచి కావచ్చు.. చెడు కావచ్చు. మనం ఎంత బలంగా కాంక్షిస్తున్నామన్న అంశంపైనే ఆధారపడి ఉంది.

325.సంపద ఉప్పునీరు లాంటిది. ఎంత తాగితే అంత దప్పిక పెరుగుతుంది – గోల్డ్‌స్మిత్.

326.రెండు వర్గాల మధ్య పోరటం జయాపజయాలకు దారితీస్తుంది. ఒకే వర్గం మధ్య పోరటం ఆ వర్గ వినాశనానికి దారితీస్తుంది – డా. బి. ఆర్. అంబేద్కర్.

327.అనవసరమైన అవసరాలను అంతం లేకుండా పెంచుకుంటూ పోవటమే నాగరికత – మార్క్ ట్వెయిన్న్.

328.ప్రజలు శక్తివంతమైన సంస్థలకు సైతం నైతిక ప్రమాణాలు నిర్ణయించి అమలు చేయించగలరు – నోమ్ చామ్‌స్కీ.

32.వ్యాయామం ఎదైనా, నిరంతర సాధన సహనాన్ని పెంచుతుంది. ఎక్కువ దూరం పరుగు కూడా సహనాన్ని పొందడానికి సరియైన శిక్షణ – మావో.

330.గొంతు విప్పడమే పౌరుడి కర్తవ్యం – గుంతర్ గ్రాస్.

331.మనమంతా పరస్పరం తోడ్పాటు అందించుకోవాలి. మానవులంటేనే అలా వ్యవహరిస్తారు. ఇతరులకు సంతోషాన్ని 332.ఇచ్చే విధంగా బతకాలి తప్ప ఇబ్బంది పెట్టడం ద్వారా కాదు – చార్లీ చాప్లిన్.

333.స్వాతంత్ర్యం ఒక పక్షి వంటిది. ఎగరగలిగితేనే స్వేచ్చ, లేకపోతే బానిసత్వం – మహాత్మా గాంధీ.

334.తాత్కాలికమైన ఆనందం కోసం కాకుండా శాశ్వతమైనా ఆనందం కోసం విస్తృతమైన ఆలోచనలు చేయాలి. తాత్కాలికమైన ఆనందం కోసం పాకులాడితే శాశ్వతమైన దు:ఖం మిగులుతుంది. కాలేజీ లైఫ్ లో ఎంజాయ్‌మెంట్ ఉండచ్చు కానీ అదే జీవితం కాకూడదు. మానసిక పరిపక్వత రాలేదనో, బలం సరిపోలేదనో వెనకడుగు వేయడం తగదు.

335.ఉన్నతంగా, భిన్నంగా, వేగంగా, ముందుగా ఆలోచించు, ఉత్తమ లక్షం పెట్టుకో – దీరూబాయ్ అంబాని.

336.పేదరికం అనుభవించిన వారికే డబ్బు విలువ బాగా తెలుస్తుంది. డాబుసరి వ్యక్తులు ఒక్కసారి పేదరికపు జీవితాన్ని చూస్తే వారి మనస్సు డబ్బుని దుబార చేయనివ్వదు – సరోజిని నాయుడు

337.నిజమైన స్నేహం మంచి ఆరోగ్యం లాంటిది. పోగొట్టుకోనంతవరకూ దాని విలువ తెలుసుకోలేము

338.రేపటి గురించి ఆలోచించకుండా ప్రతిరోజూ మనసారా జీవిస్తే చాలు

339.జాలి చూపె హ్రుదయం కన్నా సహాయం చెసె చేతులు మిన్న

340.మంచి మాట మంచి మనస్సు ఆకాశం లాంటివి అవి అంతటా విస్తరిస్తాయి.

341.పుష్పం నుంచి సుగంధాన్ని, నువ్వులనుండి నూనెను, పాలనుండి వెన్నను, ఫలం నుంచి రసమును,ఆరణి నుంచి అగ్నిని ఏ విధంగా తగిన ఉపాయాలతో వేరుపరచుకొందుమో, మనదేహంలో గల ఆత్మ జ్ఞానాన్ని వేరుపరచి, ఉపయోగించి గొప్పవారు కావాలి.—–స్వామి వివేకానంద.

342.తరాలు తిన్నా తరగని ధనముంది

ఎదటి మనిషిని ఎదిరించే ధైర్యముంది

ముప్పొద్దులా ఘుమఘుమలాడే తిండుంది

విశ్వకర్మే విస్తుపోయేంతటి భవనముంది

ఊరంతా గొప్పగా చెప్పుకునే పేరుంది

అందరూ జేజేలు పలికే ప్రఖ్యాతుంది

ఇంట్లో ఎదురూచూసే భార్య ఉంది

మురిపించి మరపించే సంతానముంది

తప్పు చేస్తామని చూచే సంఘముంది

పలకరిస్తే పులకరించే స్నేహముంది

అనుభూతుల్ని దాచుకొనే మనస్సుంది

అంతరిక్షంలోకి ఎగరగలిగే విఙ్ఞానముంది

కానీ వస్తూ..పోతూ..

మనతోనే ఉన్నట్టనిపిస్తూ..

అంతలోనే మాయమైపోతూ..

ఉన్నదని భ్రమించేలోపే లేదన్న చేదు నిజాన్ని తెలియజేస్తూ

ఎండమావిలాంటి అందమైన “ఆనందం”, జీవితంలో అచ్చంగా మన సొంతమౌతుందా?

343.చిత్రమైన జీవితం…

బాల్యం విలువ అది గడచిపోతే కానీ తెలియదు

యవ్వనం లో ఉన్న శక్తి అది ఉడిగిపోయేదాకా తెలియదు

సంసార జీవితంలో మన గురించి ఆలోచించే సమయం దొరకదు

జీవితం గురించి అర్థం చేసుకోవాలంటే ఈ జీవితం సరిపోదు…..

344.తెలిసిన వాళ్లకు చెప్పవచ్చు. తెలియని వాళ్లకూ చెప్పవచ్చూ. కానీ, తెలిసీ తెలియని వాళ్లకు చెప్పడం చాలా కష్టమంటారు

345.భగవంతుడి గురించి నిరంతరం ఆలోచిస్తున్న కొద్దీ భక్తి వృద్ధి చెందుతుంది. మనసు దైవం మీద లగ్నం అయితేనే ప్రతీదీ మంగళకరంగా కనపడుతుంది. మన ఆలోచన మంచిదైతే ఆచరణా మంచిగానే ఉంటుంది. అందుకే అన్నారు దృష్టిని బట్టే సృష్టి అని. ఎప్పుడైతే మన మనసు భగవంతునిమీద లగ్నమై ఉంటుందో ఆ క్షణం నుంచీ మనం చేసే ప్రతీ పనిలోనూ ఆయన రూపమే కనిపిస్తుంది. మాట్లాడే ప్రతీ మాటా భగవంతుడి దరికి చేర్చే సిద్ధ మంత్రమే అవుతుంది.

346.బలమే జీవనము బలహీనతే మరణం – స్వామి వివేకానంద

347.మంత్రం కాని అక్షరం లేదు. ఔషధం కాని చెట్టు వేరు లేదు. పనికి రాని మనిషీ లేడు. వీటిని ఉపయోగించుకునేవాడే లభించటం లేదు

348.మనిషి జీవితానికి ఒక పరమ గమ్యం ఉందని అది ఆత్మ సాక్షాత్కారం

349.మాటతో జీవితం మారుతుంది. మాట తేడాతో యుద్ధాలు జరుగుతాయి

350.మనసులు కలిస్తే జీవితాలు ఆనందమయంగా మారుతాయి. మనసు విరిగితే జీవితాలు చెదిరి పోతాయి

351.పనికి రాని మనిషి ఈ ప్రపంచం లో ఉండడు. కొందరిలో తెలివి తేటలు తక్కువగా ఉండొచ్చు. కాని వారు కూడా శ్రమ తో గొప్ప వారు కాగలరు. కొందరిలో తెలివితేటలు ఎక్కువగా ఉండొచ్చు. కాని వీరు బద్ధకానికి లోనైతే జీవితంలో ఏమీ సాధించలేరు. ప్రకృతి అన్నింటినీ మనిషికి ఇచ్చింది. ఒక్క బద్ధకాన్ని, సోమరి త.మనిషి కర్మవల్ల కాదు, సంతానం వల్ల కాదు, ధనం వల్ల కాదు- ఒక్క త్యాగం వల్ల మాత్రమె అమృతత్వాన్ని పొందగలడు. నాన్నిఒదిలించుకో గలిగితే, ధైర్యాన్ని పుంజుకో గలిగితే మనిషి సాధించలేనిది లేదు.

352.సహనం లేని ఆడది.. వినయం లేని మగవాడు ప్రాణం ఉన్నా లేని జీవత్సవంతో సమానం

353.సమస్కారం లేని వేదాలు చదివిన అర్చకుడి కన్నా సమస్కారం ఉన్న వేదాలు తెలియని యాచకుడు గొప్పవాడు

నాది అనుకున్న ప్రతిదీ ఒకనాటికి నిన్నువిస్మరిస్తుంది.నువ్వు ప్రేమిస్తున్న ఈ జీవితం జారిపోతోంది అనుక్షణం

నువ్వు వెతుకుతున్న గమ్యం ఉంది నీలోనే ,నీ ప్రయాణం నిజానికి సాగాలి నీ లోనికి,అదే నిజమైన జీవితం,అపుడే ఈ తృష్ణకి అంతం

354.మనిషి కర్మవల్ల కాదు, సంతానం వల్ల కాదు, ధనం వల్ల కాదు- ఒక్క త్యాగం వల్ల మాత్రమె అమృతత్వాన్ని పొందగలడు.

355.పరుల కొఱకని వృక్షము ఫలములిచ్చు.

పరుల కొఱకని ధేనువు పాల నిచ్చు.

పరుల కొఱకని నదులిల పారుచుండు.

పరులకుపకారములుఁ జేయఁ బ్రతుక వలయు.

భావము:-

చెట్లు పరులకుపకరించుట కొఱకే ఫలించుచుండును. ఆవులు పరులకుపకరించుట కొఱకే పాలనిచ్చును. నదులు పరుల కుపకరించుట కొఱకే ప్రవహించు చుండును. పరుల కుపకారము చేయుటయే యీ శరీరము కలిగి యున్నందులకు ప్రయోజనము

356) దేవుడు ఎక్కడ వున్నడో, అక్కడ మరేమీలేదు ఎక్కడ లోకం వున్నదో, అక్కడ దేవుడు లేడు ఈ రెండు ఎప్పుడూ కలవవు, వెలుగు చీకట్ల లాగ –

357)ఎందుకు ప్రజలు అంతగా భయపడుతారు?

దీనికి సమాదానము – వాల్లు తమను నిస్సహాయకులుగ, ఇతరుల మీద ఆధార పడే లాగా చేసుకున్నారు. మనము చాలా బద్దకస్థులము, ఏ పని సొంతంగా చేయాలనుకోము. మనకు అన్నీ చేసిపెట్టదానికి ఓ దేవుడో, సమ్రక్షకుడో లేదా ఓ ప్రవక్తో కావాలి.

358)సమానత్వము లేకుంటే స్నేహము వుండదు

359)సత్యము ఏ సమాజానికి జోహార్లు పట్టదు. సమాజమే సత్యానికి జోహార్లు పట్టాలి, లేదా – అంతమవుతుంది

360)భగవంతున్ని నీవు నమ్మవు, నిన్ను నీవు నమ్మనంతవరకు.

361)భగవంతుడిని ఎక్కడ కనుగొనగలం,మన మనసుల్లోను మరియు ఏ జీవములోను మనకు కనిపీయనప్పుడు?

362)ఆలోచనలు జీవిస్తాయి, పయనిస్తాయి; మన ఆలోచనలే మన రూపు దిద్దుతాయి; అందుకే ఆలోచించే విషయాల గురించి జాగ్రత్త తీసుకో!

363)మనము ఇతరులకు ఎంత మంచి చేస్తామో,మన మనస్సులు అంత పవిత్రమవుతాయి; అప్పుడు భగవంతుడు వాటిలో ఉంటాడు.

364)నీవు నిత్యం నిర్భీతునిగా ఉండు.భయమే మృత్యువు,నిర్భయమే జీవితము.

365)అచంచల ఆత్మవిశ్వాసం గలవాడికి సముద్రం పిల్లకాలువ లాగా,మహోన్నతపర్వతాలు గోపాదంలాగా కనిపిస్తాయి.–స్వామి వివేకానంద

366)భగవంతుడు మనిషికి ఎదుర్కోలేని కష్టాలు ఇవ్వడని గుర్తుంచుకో.— పరమహంస యోగానంద

367)అగాధమైన సముద్రంలో ఆణిముత్యం ఉన్నట్లే దుఃఖాల వెనుక సుఖముంటుంది.సాదించి శోధించాలి. — శ్రీశ్రీ

368)నీకు విజయం వరించాలని ఆశించబోయేముందు అందుకు నీవు అర్హుడవో,కావో ఆలోచించు.— ఖలీల్ జిబ్రాన్

369)లేవండి, మేల్కొనండి, గమ్యం చేరుకొనేవరకు విశ్రమించకండి

370)క్షమ, ఇంద్రియ నిగ్రహం, ప్రేమ, సత్య వచనాలు, రుజువర్తనం, వినయం, సేవ. … ద్రవీభవిస్తుందో అతను మనకు బంధువు కాకపోయినా వెయ్యిమంది బంధువుల కన్నా మిన్న” అంటారు స్వామి వివేకానంద

371)జీవితమనే కట్టడానికి బాల్యం పునాది రాయి. బాల్యంలో నాటే విత్తనం జీవిత వృక్షంగా వికసిస్తుంది. బాల్యంలో బోధించే విద్య, కళాశాలల్లో, విశ్వ విద్యాలయాల్లో నేర్చుకొనే విద్య కన్నా ఎంతో ప్రధానమైనది. మనిషి 372)పెరుగుదల ప్రక్రియలో పరిశరాల అధ్యయనం, తగినటువంటి మార్గదర్శకత్వం ముఖ్యమైనవి

373)నిన్ను నమ్మేది జనం, నడిపేది దైవం

చేరాల్సింది గమ్యం ,కావాల్సింది నమ్మకం

వదలాల్సింది అనుమానం ,వరించేది అదృష్టం

పొందేది విజయం ,జీవితమంతా ఆనందం /సంతోషం

374)అసలైన విప్లవం జరగవలసినది హృదయపు లోతులలో… మనిషిలో… రాజకీయ, ఆర్ధిక విప్లవాలు కానీ, సామాజిక సంస్కరణలు కానీ ఈ పరివర్తనను తేలేవు. నూతన ఆదర్శాలు, మతాత్మకమైన ఆశయాలు అవలంబించినా, కొత్త సిద్ధాంతాలతో, కొత్త పద్ధతులలో మనిషిని నిర్భందించినా ఇది జరగదు. తనని తాను పూర్తిగా అవగాహన చేసుకుంటూ హృదయంతో స్పందిస్తూ జీవించటంలోనే పరివర్తన సాధ్యమౌతుంది.-జిడ్డు కృష్ణమూర్తి

375)ప్రతి మనిషికీ ఎన్నో అవసరాలు వుంటాయి. వాటిల్లో చాలా వాటిని డబ్బుతో సమకూర్చుకోవచ్చును. కానీ అన్నీ డబ్బుతో సమకూడవు. ముఖ్యంగా ఆనందం , సంతోషం కేవలం డబ్బుతో సంపాదించలేము. కానీ చాలామంది పొరపాటు అవగాహనతో డబ్బుకు లేనిపోని ప్రాధాన్యతనిచ్చి, దాని సంపాదన కోసం తమకు అనేక రంగాల్లో వున్న ఆసక్తులను, అభిలాషలను చంపుకొని శక్తియుక్తులన్నీ కేంద్రీకరిస్తున్నారు

376)కడుపు కాలుతున్నపుడు సంపాదించిన 10 రూపాయలకి ఇచ్చే విలువ, కడుపు నిండినతరువాత సంపాదించే ఏ పది రూపాయలకీ ఉండదు. ఇది అందరికీ అనుభవమే. అసలు ఆనందం అనేది బయట ఎక్కడో లేదు. నిజంగా ఆనందంగా వుండేవాడికి డబ్బుతోనూ, సౌకర్యాలతోనూ పనేలేదు.

377)ఒకరికి మంచి అనిపించేది మరొకరికి చెడు అనిపిస్తుంది, మరొకరికి పిచ్చితనం అనిపిస్తుంది. ఒక్కటే విషయం, చూసే మనిషి దృక్పథాన్ని బట్టి అభిప్రాయం మారుతూ ఉంటుంది

378)బండివెలుతుంటె దాని చక్రాల అడుగుభాగం పైకి, పైభాగం అడుగు కు వెల్లినటు మనజీవితం లొ కష్ట సుఖాలు అంతె ఒకదాని తరువాత ఒకటి వస్తాయి

379)జీవితం నీకు కావలసింది ఇవ్వదు ,నువ్వు కోరుకున్నదే ఇస్తుంది

380)ఎన్ని ఒడుగుదోడుగుల్లోనైన నీ వ్యక్తిత్వాన్ని కోల్పోకు .మంచితనాన్ని వదులుకోకు మానవతను మరువకు .అప్పుడే దైవం ప్రసాదించిన ఈ జీవితానికి సార్ధకత !!!

381)గతాన్ని తవ్వితే,మిగిలేవి బాధలే…

ముందున్న లోకమే శూన్యంగా మారెలే…

మిగిలున్న జీవితం నిరర్ధకం కాదులే….

ప్రయత్నించి చూస్తే గెలుపేదో దక్కులే…

తప్పదు ఓటమి ఓ క్షణం,జీవితం గెలుపోటముల మిశ్రమం…

బాధపడి బ్రతికితే ఈ క్షణం,తిరిగిరాదులే గడిచిన జీవితం…

చిరునవ్వుతో జీవించు ప్రతిక్షణం,ఓటమైనా ఓడిపోదా మరుక్షణం…

ఇదియే నీకు నా సందేశం,సాధించి చూపించి కలిగించు మాకు సంతోషం

382)కోపానికి దూరంగా వుండుము ,దైవానికి దగ్గరగా వుండుము

383)ఆవేశంతో ఆలోచించకు ,ఆవేశము అనర్దాలకి కలిగించునని మరువకు

384)నొప్పించే మాటలు వద్దు, మెప్పించే మాటలు ముద్దు

385)దేవుడ్ని పూజించుటలో తృప్తి పడకు ,పక్క వాడికి సహాయం చెయడంలో సంతృప్తి పడు

386)మనకు తెలిసింది కొంచం తెలియనిది అనంతం

387)హద్దులు లేని ఆశలు వద్దు ,హద్దులు లోనే వుంది ముద్దు

388)రోజుకొక మంచి పనైనా చేయుము,మంచి చేయుటు మంచి మూహుర్తం కోసం ఎదురు చూడకు

389)అంతర్ కాలం అందరికి వుంది ,ఇప్పుడు వుండే కాలాన్ని మంచికే వినియిగించుకో

390)వంద మంది వైద్యులు వెంట వున్నా ,పర లోక ప్రయాణం ఆపలేరని తెలుసుకో …కాబట్టి బ్రతికి వుండే తప్పుదే మంచి చేయి

391)మనకి కావాలి అనుకున్నవి దొరకనప్పుడు,మనకు దొరికినదే కావలి అనుకోవడమే మంచిది

392)ఒకరి భావాలు ,మరొకరికి భారం కాకూడదు

393)జీవితపాఠాలకు పునాది నా ఉగాది,

చేదు: ఇంకొకసారి చేయకూడని అనుభవం,

తీపి: మది నిండిన ఆనందం,

వగరు: గతం చేసిన గాయం,

పులుపు: జీవితం నేర్పిన గుణపాఠం,

ఉప్పు: మనకు ఇచ్చిన చనువుతనం,

కారం: తప్పు చూసినప్పుడు కోపం.

షడ్రుచుల సంగమం ఉగాది,అదే నా జీవనప్రయాణానికి పునాది.

394)స్వయం సమృద్ది సాదించడం ఎంత అవసరమో పరస్పరం ఆధారపడగలిగే సామరస్యాన్ని సాదించడం కూడా అంతే అవసరం

395)పొదుపు రెండు రకాలు .ఒకటేమో ఖర్చుపెట్టగా మిగిలింది పొదుపు చేయడం. రెండు పొదుపు చేయగా మిగిలింది ఖర్చుపెట్టడం .రేనోడే ఉత్తమ మార్గం.

396)డబ్బు .. మన సౌలబ్యం కోసం మనం సృష్టించుకున్న ఓ అవసరం.ఆ సత్యాన్ని అందరు గుర్తించాలి.అలా అని డబ్బే లోకం అనుకుంటే పొరపాటే

397)డబ్బు అమ్మాయి లాంటిది .ప్రాణానికి ప్రాణంగా ప్రేమించేవాళ్ళనే ఇష్టపడుతుంది. అడ్డ దారిలో దగ్గర అవ్వాలని చూస్తే అస్యహించుకుంటుంది.

398)ఎవరైనా “నాకు డబ్బు మీద ఆసక్తి లేదు” అని అన్నారంటే …సంపాదించటం చేత కాదని ఒప్పెసుకున్తున్నారని అర్ధం

399)మరణించిన సింహం కన్నా బ్రతికివున్న కుక్క మేలు

400)ఎదుటు వారిలో తప్పులు వెతకడమే పనిగా పెట్టుకుంటే బంధువులూ స్నేహితులూ ఎవరు మిగలరు.

401)స్వయం సమృద్ది సాదించడం ఎంత అవసరమో పరస్పరం ఆధారపడగలిగే సామరస్యాన్ని సాదించడం కూడా అంతే అవసరం .

402)దుష్టులకు దూరంగా వుండాలి .కాని వారితో విరోధంగా వుండకూడదు

403)కదలకుండా కూర్చుంటే కల కరిగిపోతుంది.ఆచరణకు పూనుకుంటే స్వప్నం సాకరమవుతుంది

404)నిజం మాట్లాడడానికి మించిన దైవత్వం లేదు. నిజం పలకడానికి ధైర్యం కావాలి.

405)ప్రేమ కూడా ఒక విద్యే! ఒక కళే! దాన్ని నేర్వనివాడు దానికి దూరంగా ఉండడమే వాడికీ, ఇతరులకూ క్షేమం.”

406)నెయ్యిలేకపొయినా ,కూరలేకపొయినా తిండి పెట్టండి పర్వాలేదు, కాని పెట్టెదేదయినా ప్రేమతొ పెట్టండి.అప్పుడే పెట్టినవారికీ పుణ్యము వస్తుంది, తిన్నవారికి ఆకలి తీరుతుంది.కాబట్టి వంటకాల రుచి కాదు ముఖ్యం,పెట్టేవారి ఆప్యాయత,ప్రేమ ముఖ్యం

407)తగని చోట మంచి పని చేసినా తప్పుగానే భావిస్తారు.అందుకే తగని చోటుకు వెళ్ళద్దు, వెళ్ళి నిందలు పడద్దు

408)చెప్పింది చేసి చూపించేవాడే ఆదర్శ గురువు,కానివాడు మానవ సమాజానికే బరువు

409)కాలాన్ని ఇమ్మని తప్ప మరేదైనా అడుగు ఇవ్వగలను. ఎందుకంటే అది ఒక్కటే నా చేతిలో లేనిది — నేపోలిన్

410)ఎప్పుడు ఒప్పుకోవద్దురా ఓటమి ఎన్నడు వదులుకోవద్దురా ఓరిమి దేహముంది , ప్రాణముంది , నెత్తురుంది , సత్తువుంది అంతకన్నా సైన్యముండునా

411)ఎవరినీ తప్పు పట్టవద్దు , నిందించవద్దు సహాయపడగలిగితే సాయంచేయ్యి లేకపోతె ఆశీర్వధించి పంపివేయు .

412)మనలను మన ఆలోచనలే తీర్చు దిద్దుతాయి,మాటలదేముంది ఆలోచనలే కలకాలం ఉంటాయి .

413)దేవుడు ఎక్కడో లేదు . నీలోనే ఉన్నాడు.ప్రతీ జీవిలోను ఉన్నాడు.ఇతరులకి మనము ఎంత మేలుచేస్తే ,మన హృదయాలు అంత పవిత్రమవుతాయి.

414)ఒక నాయకుడు తన చుట్టూ ఏమి జరుగుతుందో తెలుసుకోగలిగినప్పుడే తన బృందాన్ని స్వేచ్ఛగా నడిపించగలుగుతాడు. నాయకత్వమంటే నిరంతర అభ్యసనమే

415)నాయకుడు అనేవాడు తన బృందంలో ఆత్మవిశ్వాసాన్ని ప్రోది చేసేవాడు కావాలి. ఎక్కడెక్కడ ఎవరెవరికి ప్రశంస అందాలో దాన్ని నలుగురిలో అందించాలి. వారిని విమర్శించవలసి వస్తే ఏకాంతంలో పిలిచి విమర్శించాలి

416)ఎదుటివాని స్థానంలో వుండి ఏమైనా ఆలోచించు

417)ఎదుటి వ్యక్తీ అభినందించదగిన వాడనుకుంటే మనస్ఫూర్తిగా అభినందించు. లేకుంటే అభినందించడం మానివేయి

418)అవసరానికి ఇచ్చింది అర్ధరూపాయైనా అది జీవితంలో తీర్చుకోలేని ఋణం.

419)ఇష్టపడి ఇచ్చేది దానం, అయిష్టంగా ఇచ్చేది లంచం.

420)ఏ తీర్పు చెప్పినా ,ఎదుటి వారి స్థానం నీధనుకుని చెప్పు.

421)నీ అవసరానికి చేసేది నిజమైన స్నేహం కాదు. వ్యక్తి లోని మంచి వ్యక్తిత్వాన్ని బట్టి ఇచ్చేదే నిజమైన స్నేహం.

422)మనిషి వ్యక్తిత్వాన్ని బట్టి ఇచ్చేదే నిజమైన గౌరవం, హోదాను బట్టి కాదు.

423)చెడ్డపని అని తెలిసీ చేయూతవ్వడం ఆత్మహత్యకన్నా మహా పాపం.

424)పొరుగు వారితో పోల్చుకో.కానీ, మంచి లక్షణం ఎంచుకో.

425)అన్ని విషయాలను అవగాహన చేసుకో. అవసరమైన మంచిని మాత్రమె వినియోగించుకో.

426)ఫలితాన్ని ఆశించి సహాయమందించడం పధ్ధతి కాదు.

427)చెడు చేసే వారంతా చెడ్డ వాళ్ళుగా , మంచి చేసే వాళ్ళంతా మంచిగానూ కనబడకపోవచ్చు.

428)ఒక వ్యక్తి నేర్పేది నిజమైన విద్య కాదు. నేర్చిన ఆ వ్యక్తి ఆ విద్యనూ మరొకరికి నేర్పగాలిగేలా నేర్పేదే నిజమైన విద్య.

ఆవేశమున్న వేళ ఆలోచన చేయకు.

429)జీవితంలో ముఖ్యమైన మూడు విషయాలు అంకితభావం కలిగిన లక్ష్యం, జ్ఞానం, కృషి

430)తెలుసుకోవడం సృజనను పెంచుతుంది ,సృజన ఆలోచనకు దారి తీస్తుంది .ఆలోచన జ్ఞానం పెంచుతుంది, జ్ఞానం మిమ్ములను గొప్పవారిని చేస్తుంది

431)ఎదుటివారినుంచి నువ్వు ఏది ఆశిస్తావో దాన్ని నువ్వు కూడా ఎదుటివారికి చేస్తే స్నేహం పదికాలాలపాటు మనగలుగుతుంది

432)వ్యక్విగత సేవలకంటే సామాజిక సేవలో ఎక్కువ ఆనందం కలుగుతుంది. ప్రతివారూ సేవలో పాల్గొనాలి. సేవకుడే నాయకుడైననాడు ప్రపంచం అభివృధ్ది చెందుతుంది

433)మన జీవితములో అనేక వేలమంది సహాయ సహకారములు పొందుతున్నము. ఇతరులకు ఎల్లవేళలా సహాయపడుతూ ఆ ఋణాన్ని తీర్చుకోవాలి. ఇతరులకు సహాయపడాలన్న కోరికతో వీలైనంత సేవచేయటములో ఆత్మానందం లభిస్తుంది. ఈ సేవలు ఎప్పుడూ ప్రతిఫలాపేక్ష లేకుండా ప్రేమతో చేసినప్పుడే దైవప్రీతిని పొందగలము. అసలైన సంఘసేవకు కావలసిన శక్తిసామర్థ్యాలు, నైపుణ్యం అప్పుడే లభిస్తాయి.

434)ఏదైనా సమస్యలో చిక్కుకున్నప్పుడు, ఆవేశపడకుండా కాస్త మౌనం వహించి, ఆలోచించే ప్రయత్నం చేయండి. ఎందుకంటే, మౌనంలోనే దేవుని మనము దర్శించవచ్చు. ఆ మౌనంలో మనలోని దైవత్యం మేలుకుంటుంది. అది మనలో ప్రేమ భావనను కలిగిస్తుంది. ఆ ప్రేమ భావనతో మనము ఆలోచిస్తే, తప్పకుండా ఒక మంచి పరిష్కారం దొరుకుతుంది.

435)ఏదైనా పని చేసేటప్పుడు కష్టాలు ఎదురైతే, ఈ పని ఎందుకు చేస్తున్నాము, దీని వలన మనకు సంతోషము కలుగుతుందా అని ప్రశ్నించుకొని తర్వాత కొనసాగాలి.

436)మనిషి కొరకు డబ్బు, డబ్బు కొరకు మనిషి కాదు అని గుర్తుంచుకోండి. ఈ‌ విషయం గుర్తుంచుకుంటే మనము జీవితంలో ఏమి కావాలన్నా సాధించగలము

437)జీవితమంతా డబ్బుతో, డబ్బు చేత, డబ్బు కొరకు నడుస్తున్నది. తన జీవితములో ఈ‌ సత్యాన్ని సరిగ్గా అర్థం చేసుకున్నవాడే జ్ఞాని, చేసుకోలేనివాడే అజ్ఞాని.సూర్యుడు తూర్పున ఉదయిస్తాడనుట ఎంతటి సత్యమో, ఇది కూడా అంతే సత్యము.

438)మంచి ఎక్కడున్నా ప్రోత్సహించాలి ఉన్నత ఆశయం ఎవరి దగ్గర వున్నా వేల గొంతులతో ప్రచారం కల్పించాలి .ఆ సేవలు నలుగురికి తెలియాలి .అది ప్రతి మనస్సుని కదిలించాలి .ఆ స్పందనతో ప్రతి ఒక్కరు చేయగలిగినంత సాయం చేయాలి…. స్పందించే ప్రతి మనస్సుకి శతకోటి వందనాలు.

439)తక్కువ ఆశించాలి ,ఎక్కువ త్యాగం చేయాలి..అప్పుడే దేవుడు ఇచ్చిన ఈ జన్మ సఫలిక్రుతం కాగలదు

440)ప్రకృతిలో ప్రతి ఒక్కదానికీ తనకంటూ ఒక ప్రత్యేకత ఉంటుంది. ఒక కోడి ఆ సంగతి తెలుసుకోకుండా నెమలి తనకంటే అందంగా ఉందని, నెమలి ఈకలు ఉన్నంత అందంగా తన ఈకలు లేవని ఉడుక్కుంది. ఆకోపంతో తన ఈకలు అసహ్యంగా కనిపించాయేమో పీకేసుకుంది.అప్పుడు ఏమవుతుంది? ఈకలు పీకిన కోడవుతుంది కాని నెమలి అయిపోతుందా? మరొకరికి ఉన్న వాటిని మనకు లేవని దిగులు పడకూడదు, మనలో ఉండే మంచి లక్షణాలకు మెరుగులు పెట్టి ప్రత్యేకత సంపాదించుకోవడం విజ్ఞత అవుతుంది కాని, ఉడుక్కుని మనలో ఉన్న సమర్ధతను కూడా పోగొట్టుకోవడం మంచిది కాదు.

441)మన జీవితములో అనేక వేలమంది సహాయ సహకారములు పొందుతున్నము. ఇతరులకు ఎల్లవేళలా సహాయపడుతూ ఆ ఋణాన్ని తీర్చుకోవాలి. ఇతరులకు సహాయపడాలన్న కోరికతో వీలైనంత సేవచేయటములో ఆత్మానందం లభిస్తుంది. ఈ సేవలు ఎప్పుడూ ప్రతిఫలాపేక్ష లేకుండా ప్రేమతో చేసినప్పుడే దైవప్రీతిని పొందగలము. అసలైన సంఘసేవకు కావలసిన శక్తిసామర్థ్యాలు, నైపుణ్యం అప్పుడే లభిస్తాయి.

442)వెక్కి వెక్కి ఏడిస్తే వెతలు తీరునా..కలతసెంది కూకుంటే కతలు మారునా..

అంతటి సూరీడుకైనా తప్పదుగా గ్రహణం

అంతటితో కృంగిపోతే ఉంటుందా ఉదయం??

443)తీపు దొరకని వాడు ..చేదుని వెలుగు దొరకని వాడు ..చీకటిని మెచ్చుకుంటాడు ..అదే జీవితం

444)గర్వం శత్రువుల్ని పెంచుతుంది – మిత్రుల్ని పారద్రోలుతుంది

445)డబ్బుమీద అమిత ప్రేమే అన్ని అనర్థాలకి మూలం

446)తెలిసేవరకూ బ్రహ్మవిద్య – తెలిస్తే సాధారణ విద్య

447)మనకుగల శక్తిని బట్టి మనల్ని మనం అంచనా వేసుకుంటాం .మనం చేసే పనుల్ని బట్టి ఇతరులు మనల్ని అంచనా వేస్తారు

448)ప్రపంచంలో చీకటి అంతా ఏకమైన ఒక అగ్గిపుల్ల వెలుగుతురని దాచలేదు ,లక్ష్య సాధనకు పట్టుదల తోడైతే నీ విజయాన్ని ఎవరూ ఆపలేరు

449)విజయం అంటే మనం కోరుకొని ఎదురు చూసి వెనుకడుగు వేయకపోవడం !

450)ప్రతి జీవికీ ప్రకృతి సిద్ధమైన భాద్యతలూ, కుటుంబ పరమైన భాద్యతలూ, సామాజిక పరమైన భాద్యతలూ ఉంటాయి ! తమవి కాని హక్కులు లభించలేదని, భాధ్యతలను విస్మరించడం, జీవితాలను త్యజించడం, అవివేకం, అన్యాయం, అనాగరికం, అనైతికం

451)పెద్దల కాళ్ళకు నమస్కరించాలంటే చిన్నతనంలో చిన్నతనంగా ఉండేది…

కాని పెద్దవాడినయ్యాక తెలిసింది, అలా చేయడంలోనే పెద్దరికం ఉంటుందని…

452)పెద్దలు చెప్పిన మాట : నాకు దేశం ఏమిచ్చిందని కాదు, దేశానికి నేను ఏమిచ్చానని ఆలోచించాలి !

అది ప్రతి పౌరుడూ తన దేశం గురించి చేయవలిసిన పని !

453)కష్టం వస్తే కన్నీరు రానీయకు, నష్టం వస్తే నిరాశను రానీయకు…

నీ ధైర్యమే నిన్ను నువ్వు ఇష్టపడే తీరానికి చేరుస్తుందని మరువకు…

454)నమ్మకం అనేది నీలోనే ఉండే ఆయుధం లాంటిది…

దాని తోడుగా తలబడితే ప్రతి యుద్దంలో విజయం నిన్నే వరిస్తుంది…!

455)అక్షరాలతో సావాసం చేయవలసిన బాల్యం అష్టకష్టాల పాలు కాకుండా ఉండేందుకు…

బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించాలి.. భావి భారత పౌరులకు నవ సమాజాన్ని నిర్మించాలి…!

456)శ్రమ నీ ఆయుధం అయితే విజయం తప్పక నీ బానిస అవుతుంది

457)చీకటిలో ఉన్నానని చింత పడకు..దానిని చీల్చుకొని వచ్చే వెలుగు కోసం ఎదురు చూడు ..ఓటమి పొందానని కలత చెందకు ,ఓటమినే ఓడించి గెలిచే మార్గాన్ని వెతుకు .నమ్మకం నీ చేతిలో ఒక యుద్ధం .ఆ నమ్మకంతో ముందుకు వెళ్ళు ..విజయం అన్ని వేలలలా నీ చెంతనే ఉంటుంది

458)కులమతాలనేవి మనం పుట్టించినవి కాని మానవత్వమనేది మనలో మనతోనే పుట్టేది…

మానవత్వం ముందు అంటరాని తనం తలదించక తప్పదు అప్పుడే మనం మనుషులతో సమానం…

అలా జరగని పక్షంలో మనం మనిషి రూపంలో జన్మించిన మృగాలతో సమానం…! వి

459)పరీక్షలు జీవితంలో చాలా ఎదురవుతాయి వాటిని సమర్ధవంతంగా ఎదుర్కొని నిలిచే వాడే విజేత…!

460)కులం, మతం, ప్రాంతం..

మనకొద్దు వీటి రాగ ద్వేషాలు..!

మనం మనుషులం.. మానవత్వం మన సొంతం..!

మనం బతుకుతూ సమస్త జీవులు బతికేందుకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించేందుకు మనవంతు కృషి చేద్దాం..!

461)గెలుపన్నది నీ లక్ష్యం -చేసేయి దానికి యుద్ధం

ఓటమన్నది సహజం -తలవంచక దూసుకుపో నేస్తం

పదే పదే ప్రయత్నించు -పట్టు వదలక శ్రమించు

ఆకాశానికి నిచ్చెన వేయి -అందినంత పని చేయి

అనువైన సాయం చేయి -ఆపదలో వున్నా వారిని రక్షించేయి

గెలుపు ఓటమి ఒకటే అందాం

ఓటమి గెలుపుకి తొలి మెట్టని అందాం

పట్టువిడువు అసలు వద్దు అందాం

పట్టుదలే గెలుపుకి మూలమని అందాం

462)తినడానికి తిండిలేక ఉండటానికి గూడులేక కడుపుకాలి…

ఆకలితో అలమటించే పిల్లలకు పట్టడన్నం పెట్టి ఉండటానికి స్థానం కల్పిస్తే…

బ్రతకడానికి మార్గం సూచిస్తే నేరస్తుడనేవాడు ఉండదు…!

463)చేసిన తప్పును ఒప్పుకుంటే శిక్షలో కొంత తగ్గించడంలో తప్పులేదు…

తప్పు చేసి చేయలేదని సమర్ధించుకుంటే రెట్టింపు శిక్షించడంలో కూడా తప్పులేదు…!

464)ఏ పనినైనా చేసే ముందు నిన్ను నవ్వు ప్రశ్నించుకో…

నువ్వు చేసేది మంచా చెడా అని సమాధానం తప్పక వస్తుంది…

మంచి అనిపిస్తే చేసేయి చెడు అనిపిస్తే ఆపేయి…!

465)తెలిసి చేసిన ప్రతీ తప్పుకి శిక్ష అనుభవించక తప్పదు…

చిన్నదైనా పెద్దదైనా తప్పు తప్పే కనుక దాని జోలికి వెళ్లకుంటే మంచిది…!

తెలియక చేసే తప్పుని క్షమించకపోవడం తప్పు…

తెలిసి చేసే తప్పుని క్షమించడం చాలా పెద్ద తప్పు…

466)బాధలు పడినప్పటికీ నీతి తప్పకుండా నిజాయితీగా, నిశ్చలంగా ఉండగలిగిన వాళ్ళల్లో అదొక విధమైన తేజస్సు ఉంటుంది

467)భయమూ తలుపుతట్టింది ! సాహసం తలుపుతీసింది ! నువ్వు ఎక్కడ ఉండాలో నిర్ణించుకో

468)ఆనందం చెప్ప లేనిది,సంతోషం పట్టరనిది కోపం పనికిరానిది,ప్రేమ చెరిగిపోనిది,కానీ స్నేహం మరువలేనిది

469)భగవంతునికి ప్రత్యేకమైన రూపం లేదు.. ప్రత్యేకమైన లోకం లేదు..

మనం సృష్టించుకున్న కధలే మతాలుగా వృద్ధి చెందాయి నిజానికి మానవత్వమే నిజమైన మతం..

అందుకే అన్నారు మానవ సేవే మాధవ సేవ అని అందుకే ఆయనని సర్వాంతర్యామి అన్నారు…!

470)ఈ సృష్టిలో లోతైనది ఏది అంటే సహజంగా సముద్రం అంటారు కాని నేను వెంటనే జీవితం అంటాను…

ఎందుకంటే సాగరంలో మునిగితే ప్రాణాలతో తీరం చేరే అవకాసం ఉంటుంది కాని సంసార సాగరంలో మునిగితే తేలడం ఉండదు

అందులోనే ప్రాణాలు వదిలేయాలి తప్పదు…!

471)ఒంటరితనాన్ని కూడా తోడుగా మలుచుకోగలిగిన వాడు ఎప్పటికీ ఒంటరి కాలేడు.

472)దుఃఖాన్ని సృష్టించుకోవట మానేస్తే అందరూ సహజంగానే ఆనంద హృదయులౌతారు.

473)తీరికలేని పనిలో మునిగిపోవటం అలవాటు కాకపోతే దిగులుపడి నిరాశ అనే సుడిగుండంలో పడిపోతారు

474)కొన్ని ఇష్టాలు కావాలంటే కొన్ని ఇష్టాలను వదులుకోక తప్పదు…

కష్టాల కడలిలో కెరటాలకు భయపడితే సుఖాల తీరం చేరుట అసాధ్యం…!

475)అభిమానించే వాళ్ళకు దూరంగా ఉండటం నరకానికి దగ్గరగా ఉండటం రెండూ ఒక్కటే..!

476)లే… నిన్ను నువ్ఞ్వ తెలుసుకో… గెలిచే వరకూ పోరాడు బలమే జీవనం. బలహీనతే మరణం

477)సాధన లేకుండా విజయాన్ని ఆశించడం ఎడారిలో మంచినీళ్ళ కోసం వెతకటం లాంటిది

478)సంతృప్తి సహజ సంపద, ఆడంబరం కృత్రిమ దారిద్య్రం

479)అడిగేవాడు తీరని సందేహాన్ని, తెలియని సమాధానాన్ని అడిగి తెలుసుకోగలడు..

అడగనివాడు సమస్యకు భయపడుతూ తెలియని విషయాన్ని ఎప్పటికి తెలుసుకోలేడు..!

480)గమ్యం అనేది ఒక అవకాశం కాదు ,అది ఎన్నుకోవలసిన ఒక లక్ష్యం ,అది ఎదురు చూడాల్సిన వస్తువు కాదు ,కృషితో చేయాల్సినది

481)మనవ సేవే మాధవ సేవ అనే నిజం మనో నేత్రంతో చూసే వారికి తెలుస్తుంది..

కాని సమాజంలో సహజంగా చూసే కళ్ళకు నిజానికి మనం చేసేది సహాయమే అయినా ఊడిగంలా కనిపింస్తుంది..!

482)ఇష్టపడి చేసే సహాయం మనసుకి తృప్తిని ఆనందాన్ని ఇస్తుంది..

కష్టపడి అయిష్టంతో చేసే సహాయం మనసుకి అసహనాన్ని ఆవేదనని ఇస్తుంది..!

483)అవసరంలో ఉండే స్నేహితుడికి ఉపయోగపడని స్నేహితుడు..

అవసరాలకు మాత్రమే మనతో స్నేహం చేసే స్నేహితుడు అలా పిలవడానికి అనర్హుడు..!

484)మనం చేసే సహాయం పేరు ప్రక్యాతలను ఆశించేదైతే..

నువ్వు చేసిన ఆ సహాయానికి నిజమైన పేరు స్వార్ధం అవుతుంది..!మనం చేసే సహాయం ప్రతిఫలం ఆశించనిదైతే..

సహాయం పొందిన వారి మనసులో మన స్థానం సుస్థిరమవుతుంది..!

485)ఎదుటివారిన బాధ పెట్టి మనం పొందే సంతోషం కన్నా..

మనం బాధపడుతూ ఎదుటివారిని సంతోష పెట్టడం చాలా గొప్పది..!

486)నిజానికి ఏ వస్తువు విలువైన దానికి తగిన స్థానాన్ని చేరినప్పుడే ,దాని యోగ్యతకు,శక్తికి తగిన కార్యానికి ఉపయోగపడినప్పుడే కదా ఆ వస్తువుకి సార్ధకత.మానవ జన్మ కూడా అంతే

487)నేడు రేపటికి ‘నిన్న’ అవుతుంది.నిన్నటి గురించి రేపు బాధ పడకుండా వుండాలంటే,నేడు కూడా బావుండాలి

488)ఉపకారాన్ని మించిన ధర్మం లేదు ,అపకారాన్ని మించిన పాపం లేదు .ఎవరు పరోపకారం కొరకు పాతుపడుతరో వారి జీవితం సఫలం అవుతుంది

489)ఉన్నతమైన ఆశయానికి మనవంతు సాయం అందిస్తే అదో గొప్ప మానసిక సంతృప్తి

490)నదులు చక్కని నీళ్ళని ఇస్తాయి .గోవులు చక్కని పాలు ఇస్తాయి.భూదేవి చక్కని పంటలునిస్తుంది ..మరీ మనిషి? ఇవ్వడాన్ని మనిషి నేర్చుకున్నాడా అని ప్రశ్నిస్తే ,సమాధానం చెప్పడం కష్టమే .’ఇవ్వడానికి మన దెగ్గర ఏమి వుందని ? మన దెగ్గర ఏమి వుందని మనిషి ఆత్మ వంచన చేసుకుంటున్నాడు.. ఆనందం అనేది చాలా గొప్ప అనుభూతి ,దాన్ని పొందడం మన చేతుల్లో లేకపోయినా ,ఇవ్వడం మన చేతుల్లోనే వుంది!..దాన్నే ఇద్దాం పది మందికి !..

491)తెలిసేవరకూ బ్రహ్మవిద్య – తెలిస్తే సాధారణ విద్య

492)చెడు మాట్లాడకు,చెడు వినకు చెడు చూడకు

493)గర్వం శత్రువుల్ని పెంచుతుంది – మిత్రుల్ని పారద్రోలుతుంది

494)తీపు దొరకని వాడు ..చేదుని వెలుగు దొరకని వాడు ..చీకటిని మెచ్చుకుంటాడు ..అదే జీవితం

495)కృషి అనేది మానవుని విచారాన్ని పోగొడుతుంది

496)సేవే లక్ష్యం ప్రేమే మార్గం ..నువ్వు వెలిగి ప్రక్క వాడిని వెలిగించు

497)తెలుసుకోవడం సృజనను పెంచుతుంది ,సృజన ఆలోచనకు దారి తీస్తుంది .ఆలోచన జ్ఞానం పెంచుతుంది, జ్ఞానం మిమ్ములను గొప్పవారిని చేస్తుంది

498)ఏదైనా పని చేసేటప్పుడు కష్టాలు ఎదురైతే, ఈ పని ఎందుకు చేస్తున్నాము, దీని వలన మనకు సంతోషము కలుగుతుందా అని ప్రశ్నించుకొని తర్వాత కొనసాగాలి.

499).”ఒక కరెక్టు వ్యక్తిని కలుసుకోబోయే ముందు, పది మంది అనామకుల్ని విధి పరిచయం చేస్తుంది. మొదటి వ్యక్తి దగ్గరే ఆగిపోయేవాడు అనామకుడు గానే మిగిలిపోతాడు”…

500) .’అంతా తనదే’ అన్నది మమకారము.’అంతాతనే’ అన్నది అహంకారము.