విత:కించిత్ కర్తవ్యమేమిటంటే….

అత్మీయులు అనునిత్యం
స్నేహ పండుగలను జరుపుకొవాలి
మనసులు మురిసిపోతూ
ప్రేమ కావ్యాలకు ప్రేరణివ్వాలి

కుదిరిన అమిరకలతో
ప్రణయమే హద్దుల్లేని
అనందపు తీరాలలో ఓలలాడాలి
తరిమిన తూనీగల్లే సాగిపోవాలి
తడిమిన హ్రుదయాలతో
బాంధవ్యమే పద్దుల్లేని
సంతోష ఖతాలలో తేలియాడాలి
అధరాల స్పర్సలతో ముద్రలేయాలి

వయసు పరుగు వీడరాదు
మనసు దుడుకుతనం మానరాదు
సింగారాల శ్రీగంధమే
మనసు వయసులకు అద్దాలి

పిలుపు సొబగు మాయకూడదు
పలుకు రాజసం వీడరాదు
గాంభీర్యలక్షణ ఆహార్యమే
పిలుపు పలుకులకు ఊతమవ్వాలి
కొత్తందాలకై అర్రులుచాచే మనసుకు
నవయవ్వనాలకై తపనపడే వయసుకు
నలుగురు మెచ్చే నడక నడత నేర్పాలి
పదుగురు నచ్చే బ్రతుకు యువత నేర్వాలి

-విసురజ