కవిత్వం 

రాత్రంతా కలలు నిద్రిస్తాయి
పగలు కన్నులు నిద్రకోరుతాయి
పగలు చంద్రుని కోసం ఎదురుచూస్తారు
రాతిరి యదలో సూర్యోదయమవుతుంది
యుగ యుగాలుగా వర్షం కురుస్తుంది
జీవితం ఇంకా బీడులాగే వుంది
జీవితం వ్యర్థమనీ మదికీ తోస్తుంది
అవని పై ఇంద్రధనస్సు విరుస్తుంది
లోపల అగ్ని దావానలంలా మారుతుంది
బయట విచారమనే ఇల్లుకీ నిప్పుంటించాలి
దుఃఖం చెంతకు చేరి నిల్చుటుంది
ఏకాంతంతో వేగలేక మిత్రృత్వం స్వీకరిస్తారు
హృదయం లోకీ ఎందరెందరో వచ్చి చేరుతారు
అయినా మనసు ఒంటరిగా తిరుగుతుంది
రోజు వేదనను పగలు వాన కప్పివేస్తుంది
రాతిరి రోదన ఒంటరిగా నిద్రిస్తుంది
దీపంలా వెలుగుతున్నారనీ భావిస్తారు
వెనుక చీకటి కమ్ముకొంటుంది
జీవిత క్రోవ్వోతి కరిగిపోతుంది
వెలుగుతున్న దీపం చుట్టూ ఆశలు

– ఐ.చిదానందం

చరవాణి – 8801444335