న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా కొత్తగా 50 కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. గురువారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో ఏర్పాటైన మంత్రివర్గం ఆంధ్రప్రదేశ్ రెండు కేంద్రీయ విద్యాలయాలు మంజూరు చేసింది. గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం ఇర్లపాడు గ్రామంలో ఒక కేంద్రీయ విద్యాలయం, ప్రకాశం జిల్లా కందుకూరు టౌన్‌లో మరొక కేంద్రీయ విద్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నారు. దేశవ్యాప్తంగా సివిల్, డిఫెన్స్ సెక్టార్లలో ఈ 50 కొత్త కేంద్రీయ విద్యాయాలను కేంద్రం ఏర్పాటు చేయనుంది. ఈ విద్యాలయాల ద్వారా 50,000 మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించనున్నారు.