విశాఖపట్నం, ఏప్రిల్‌ 11 ఎన్నికల విధులకు వెళ్తూ మహిళా హెడ్‌ కానిస్టేబుల్‌ రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. విశాఖపట్నంలోని పీఎంపాలెం పోలీస్ స్టేషన్‌లో హెడ్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ఎం.లక్ష్మీకాంతం(46)కు అక్కిరెడ్డిపాలెంలో ఎన్నికల డ్యూటీ వేశారు. గురువారం వేకువజామునేఇంటి నుంచి ఆమె ద్విచక్ర వాహనంపై అక్కిరెడ్డిపాలెం బయలుదేరారు. జాతీయ రహదారిపై పంజాబ్‌ జంక్షన్‌ వద్ద ఎదురుగా వస్తున్న కారు ఆమెను ఢీకొంది. తీవ్రగాయాలైన ఆమెను ఎయిర్‌పోర్టు పోలీసులు ఆస్పత్రికి తరలిస్తుండగా, మార్గంమధ్యంలోనే ఆమె మృతిచెందారు. లక్ష్మీకాంతంకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.