_/\_

 

‘తెలుగు ఈ ‘
స్వాగతం!..
సుస్వాగతం!!..

‘విశ్వభాషలందు తెలుగు లెస్స’

_/\_

తెలుగు జాతి మనది..
నిండుగ వెలుగు జాతి మనది
ఈ తెలుగునాడు మనది
తేనెలొలుకు తియ్యని తేట తెలుగు మనది
తెలుగు వెలుగు మనది..
మన తెలుగు…..
మన తెలుగు భాష మన సంస్కృతికి ప్రతిరూపం!
మన జీవన సౌందర్యం!
తేనె కన్నా తీయనిది తెలుగు!
తల్లి తర్వాత తల్లి లాంటిది మన మాతృభాష!
మన భావాలకు, అనుభూతులకు
భావోద్వేగాలకు వాహిక తెలుగు భాష!
శబ్ద సౌందర్యం, అక్షర సౌష్టవం తెలుగు ప్రత్యేకత!
అక్షరం’ అంటే క్షరము కానిది. అంటే.. శాశ్వతంగా వుండిపోయేది.
దానికి ఏనాటికీ చెరుపూ, మరుపూ వుండవు . ‘అక్షరం’ మానవాళిని మునుముందుకు గొనిపోయే అనితర సాధ్యమైన మార్గదర్శకం. మనిషి మేధోవికాసానికి అక్షరం తొలిమెట్టు. ఎంతటి మేధావి అయినా చిన్ననాట దిద్దిన అక్షరాల ఆలంబనతోనే భవిష్యత్తులో శిఖరాగ్రాలకు చేరుకుంటారు. మనిషి జీవితంలో ఉన్నత స్థానానికి వెళ్ళాలన్నా, అక్షరాంబుధి విన్యాసంలో ఓలలాడుతూ తెలుగు భాష మాధుర్యాన్ని గ్రోలాలన్నా అచ్చులు, హల్లులతో కూడుకున్న అక్షరాల బారుల వెంట పయనించాలి. అక్షరం అందించే మధుర ఫలాలను దక్కించుకోవాలి!. తెలుగు అక్షరం గొప్పదనాన్ని మనం చాటి చెబుదాం!. ప్రణాళికలను తయారు చేద్దాం!. కార్యాచరణకు దిగుదాం!. తెలుగును బ్రతికించుకుందాం.

తెలుగు సాహితీ పితామహుల పొత్తిళ్ళలో పెరిగిన మన తెలుగు భాష గొప్పవిషయాలను, సమగ్ర తెలుగు సమాచారాన్ని, కళలను సాహిత్యాన్ని, తెలుగుకు సంబంధించిన సకల సమాచారాన్ని, తాజా విశేషాలను ఒక చోట భద్రపరచాలనే సంకల్పంతో ఈ ‘తెలుగు’ఇ’ ని ఆరంభించాం.

‘తెలుగు’ భాష ఔన్నిత్యాన్ని చాటిచెప్పడం, తెలుగు సాహితీ సంప్రదాయాల్ని పంచుకోవడం, మరుగునపడి, మరిచిపోతున్న తెలుగు సాహితీ ఆణిముత్యాలన్నింటిని, ఒక చోట పేర్చి హారంగా చేయడం ఈ ‘ తెలుగు ఇ’ అంతర్జాలం యొక్క ప్రధాన ఉద్దేశ్యం.

తెలుగు భాష అభివృద్దికి ఈ ‘తెలుగు ఇ ‘ అంతర్జాలం లక్ష్యాలు ఎన్నో వున్నాయి. ఒక్కొక్కటిగా కార్య రూపం దాల్చటమే దీని ఆశయం.
ముఖ్యమైన ఆశయాలు!

మన ఇతిహాసాలు, ప్రబంధాలు, చందోబద్ధమైన పద్య కావ్యాలు, మనకందించిన తెలుగుభాష తియ్యదనం. అతి మధురం కాదా? మరి ఆమధుర కావ్యాల లోని అత్యద్భుతమైన ఎన్నో ఆణిముత్యాలని వెలికితీద్దాం.

మన సంస్కృతీ సాంప్రదాయల గురించి ముచ్చటించుకుందాం!
అందరికీ ఉపకరిస్తుందనుకున్న పలు అంశాలను, పురాణేతిహాసాలను, ప్రబంధ కావ్యాలను, శతకాలను, సాంఘీక పౌరాణిక నాటకాలను, సాహిత్యం ఉట్టిపడే కధలు, హరికధలు, బుర్రకధలు, జావళీలు, జానపద గీతాలు, సామెతలు, పొడుపుకధలు, శతకాలు, నీతి శతకాలు, నీతి కధలు, శ్లోకాలు… ఇలా ఎన్నో ఎన్నెన్నో తెలుగు సాహిత్యాన్ని, కళలను, తెలుగు సంస్కృతిని, తెలుగు చిత్ర వెలుగులను వెలువరించటమే ఈ ‘తెలుగు ఇ ‘ ముఖ్యోద్దేశం! 

   తెలుగు లిపిలో పెద్దబాలశిక్ష నుంచి భగవద్గీత వరకూ అన్ని రకాల తెలుగు, సంస్కృతి, సాహితీ సౌరభాలను…. నాటి నుంచి నేటి వరకు సకల తెలుగు సమాచారాన్ని, వార్తా స్రవంతిని ఇక్కడ ఆఘ్రాణిద్దాం!.

తెలుగు-ఇ లక్ష్యం ఇదే!.

చక్కని మన మాతృభాషను కాపాడుకోవడం, సజీవంగా ఉంచుకోవడం, నిత్య నూతనంగా మలచుకోవడం తెలుగు బిడ్డలుగా మన కర్తవ్యం! ..

నిత్య జీవితంలోనూ తెలుగు వాడకం పెరగాలనే.. ఆశయంతో, ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తెలుగు చదవాలని రాయాలని, మాట్లాడాలని, వినాలనే సదుద్దేశంతో మన మాతృభాషా పరిరక్షణ కోసం ఈ “తెలుగు ఇ” ఆరంభించాం.
ఆంగ్ల భాష నేర్చుకొనడంలో తప్పూ లేదు. మారుతున్న కాలంతోపాటు.. ఆంగ్లము కూడా అవసరమే.
ఐతే.. దాని కోసం మన మాతృభాషను చిన్న చూపు చూడటం.. తెలుగు విస్మరించడం, పరభాషను అమితంగా, మాతృభాషను మితంగా ప్రేమించడం విచారకరం. తెలుగును ప్రేమించండి. తెలుగు తల్లిని పూజించండి.

మన భాష సుందరం మన భాష సుమధురం.
మన భాష అపూర్వం మన భాష అద్వితీయం
మన భాష అమోఘం మన భాష అద్భుతం
మన భాష ఆనందకరం
మన భాష అమృతమయం
అలాంటి మన తెలుగు భాషను
మనం పరిరక్షించు కొందాం!..

మన తల్లి లాంటి తెలుగు భాషను తక్కువ చేసుకోవడం సబబా? మన తెలుగును మనం కాపాడుకోవడంలో మనకు బాధ్యత లేదా ?
మీరే చెప్పండి?.

తెలుగు సంస్కృతిని, తెలుగు వైభవాన్ని, తెలుగు చరిత్రను, తెలుగు వెలుగును, తెలుగు సాహిత్యాన్ని, తెలుగుదనం, సనాతన ధర్మం గొప్పతనాన్ని, తెలుగు సాంప్రదాయాలు, తెలుగు పండుగలు, తెలుగుకు సంబంధించిన ప్రత్యేక వార్తాస్రవంతికి, తెలుగు భాషాభివృద్ధి కోసం , అంతర్జాలాల సైతం తెలుగు వాడుకకోసం, రాయడం, రాయించడం కోసం, ఒక్క మాటలో చెప్పాలంటే మాతృభాషా పరిరక్షణ కోసం “తెలుగు ఇ” ని ఆరంభించడం జరిగింది.

తెలుగు నేలపై పుట్టిన తెలుగు భాషాభిమానులందరికీ ఇదే మా ఆహ్వానం..!
మన తెలుగును ‘తెలుగు ఇ’ తో ప్రపంచానికి చూపిద్దాం!

‘విశ్వభాష లందు తెలుగు లెస్స!’.. అని చాటి చెపుదాం!!.

‘ తేనెలొలికె తీయని తెలుగు’.
_/\_

– తెలుగు ఈ

ఇతర వివరాలకు:

ఈ-మెయిల్:   www.telugue.com@gmail.com

అడ్మిన్ :       adm.telugue@gmail.com

                         admin@telugue.com

సంపాదక వర్గం:    editor.telugue@gmail.com

                                  editor@telugue.com               

నిర్వహణ-కేంద్రం:      telugue@hotmail.com

సోషల్ నెట్ వర్క్స్ :   telugue@yahoo.com

చరవాణి:       8 333 8 67 666,   8 333 9 67 666

వాట్సాప్:       8 333 0 66 000

ఫేస్బుక్ :    https://www.facebook.com/telugue

ట్విట్టర్ :      https://twitter.com/telugue

_/\_ 

జై తెలుగు తల్లి!.. జై జై తెలుగు తల్లి!!.